టీడీపీలో జేసీ ఫ్యామిటీ ఒంటరయిందా…?
రాష్ట్ర రాజకీయాల్లోనే తమకంటూ.. ప్రత్యేకతను సంతరించుకున్న జేసీ కుటుంబం గడిచిన నలభై ఏళ్లుగా అనంతపురం జిల్లాలో రాజకీయ చక్రం తిప్పుతోంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ ప్రస్థానం ఉన్న జేసీ [more]
రాష్ట్ర రాజకీయాల్లోనే తమకంటూ.. ప్రత్యేకతను సంతరించుకున్న జేసీ కుటుంబం గడిచిన నలభై ఏళ్లుగా అనంతపురం జిల్లాలో రాజకీయ చక్రం తిప్పుతోంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ ప్రస్థానం ఉన్న జేసీ [more]
రాష్ట్ర రాజకీయాల్లోనే తమకంటూ.. ప్రత్యేకతను సంతరించుకున్న జేసీ కుటుంబం గడిచిన నలభై ఏళ్లుగా అనంతపురం జిల్లాలో రాజకీయ చక్రం తిప్పుతోంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ ప్రస్థానం ఉన్న జేసీ ఫ్యామిలీ రాష్ట్ర విభజనతో టీడీపీలోకి చేరింది. అయినప్పటికీ 2014లో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా, ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక, ఆ తర్వాత.. గత ఏడాది ఎన్నికల్లో వీరి కుమారులు రంగంలోకి దిగారు. అయితే, ఓటమిని చవిచూశారు. ఇంత వరకు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి రవాణా వాహనాలకు సంబంధించి, వారికి ఏళ్ల తరబడి వస్తున్న ట్రావెల్స్ రంగానికి సంబంధించి చేసిన అవకతవకల నేపథ్యంలో అరెస్టయ్యారు. అయితే, ఈ సందర్భంగా జేసీ కుటుంబానికి పార్టీ నుంచి ఆశించిన మేరకు భరోసా కానీ, అండ కానీ లభించలేదనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
మొక్కుబడిగానే…..
అనూహ్యంగా జేసీ ప్రభాకర్ అరెస్టుకు ఒక రోజు ముందు బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్టు చేసింది. దీనికి గాను టీడీపీ అనేక ఆందోళనలు చేసింది. ఆ అరెస్టును అక్రమం అంటూ ప్రచారం చేసింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అచ్చెన్నాయుడు వ్యవహారంలో టీడీపీ శ్రేణుల నుంచి చంద్రబాబు వరకు కూడా ఆందోళనలు చేశారు. రాష్ట్రం అంతా ఆందోళనలు చేయాలని పార్టీ అధిష్టానం పిలుపు ఇవ్వడంతో ఎక్కడికక్కడ నిరసనలు జరిగాయి.అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల అరెస్టు విషయంలో మాత్రం ఇంత రేంజ్‌లో స్పందన లభించలేదనేది వాస్తవం. ఏదో మొక్కుబడిగా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో మాజీ మంత్రి నారా లోకేష్ అనంతపురం వెళ్లి జేసీ దివాకర్‌రెడ్డిని పరామర్శించి వచ్చారు కానీ, తర్వాత ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు.
జిల్లా నేతలు సయితం…
కానీ, తర్వాత మరో బీసీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టును మళ్లీ రాజకీయంగా హల్ చల్ చేశారు. ఇదిలావుంటే, జిల్లాలోనూ పార్టీ నేతల నుంచి జేసీ కుటుంబానికి పెద్దగా మద్దతు లభించలేదు. ఎవరూ కూడా అయ్యోపాపం అన్న జిల్లా నాయకుడు కనిపించలేదు. మరీముఖ్యంగా జిల్లాలో తమకంటూ ప్రత్యేకంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ విష యంలో జేసీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. జేసీ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం వీరిని ఓన్ చేసుకుని పెద్ద లీడర్లుగా గుర్తించింది. ఇప్పుడు వీరిలో కనీసం నలుగురైదుగురు కూడా జేసీ వెంట నడిచే పరిస్థితి లేదు.
ఎవ్వరూ పట్టించుకోక….
జగన్‌ను పదే పదే టార్గెట్ చేయడంతో రెడ్డి వర్గం వీరికి పూర్తిగా దూరమయ్యారు. ఇక జిల్లాలో టీడీపీ కేడర్ కూడా వీరిని ఏ మాత్రం ఓన్ చేసుకోలేదు. ఏదో 2014 ఎన్నికల్లో టీడీపీ గాలిలో వీరు ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలవడమే తప్ప వీరు టీడీపీలో రాజకీయం చేయడం వీరి అభిమానులకే నచ్చలేదు. ఇక జిల్లా టీడీపీలో పలువురు కీలక నేతలుగా ఉన్న పరిటాల ఫ్యామిలీ, పల్లె, ప్రభాకర్ చౌదరి లాంటి వాళ్లతో జేసీ బ్రదర్స్‌కు పొసిగే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రులు.. కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీతలతోనూ వీరికి తెరచాటువైరాలు ఉన్నాయి. దీంతో వీరెవరూ కూడా తాజా పరిస్థితిపై నోరు మెదకపక పోవడం, కనీసం పన్నెత్తు మద్దతు కూడా ప్రకటించకపోవడం గమనార్హం. ఒకప్పుడు అనంత జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన జేసీ పరిస్థితి నేడు జిల్లాలోనూ కాదు నియోజకవర్గంలో కూడా ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేనంత స్థాయికి దిగజారింది.