jogi ramesh : దండయాత్ర గా భలే ఫోకస్ చేశారుగా?
ఏ చిన్న సంఘటన జరిగినా చాలా వేగంగా జనంలోకి తీసుకెళ్లే సమర్థత టీడీపీకి ఉంది. ఆ పార్టీకి ఉన్న అనుకూల మీడియా కారణంగా ప్రజల మైండ్ లోకి [more]
ఏ చిన్న సంఘటన జరిగినా చాలా వేగంగా జనంలోకి తీసుకెళ్లే సమర్థత టీడీపీకి ఉంది. ఆ పార్టీకి ఉన్న అనుకూల మీడియా కారణంగా ప్రజల మైండ్ లోకి [more]
ఏ చిన్న సంఘటన జరిగినా చాలా వేగంగా జనంలోకి తీసుకెళ్లే సమర్థత టీడీపీకి ఉంది. ఆ పార్టీకి ఉన్న అనుకూల మీడియా కారణంగా ప్రజల మైండ్ లోకి సమర్థవంతంగా ఎక్కించగలదు. నిజానికి ఇంటి ముట్టడి అన్న పదం అన్నిచోట్ల చూస్తుంటాం. సీఎం ఇంటి ముట్టడికి అనేక పార్టీలు, సంఘాలు పిలుపునిస్తుంటాయి. తమ డిమాండ్ల సాధన కోసం అవతలి వారిని అటెన్షన్ ను పొందేందుకు ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని ఎంచుకుంటాయి.
ఇంటి ముట్టడికే…
నిన్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా చేసిందదే. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపి వచ్చే వారు. కానీ అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉండటంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు రాళ్ల దాడిలో గాయాలయ్యాయి. వాహనాలు ఇరువర్గాలకు చెందినవి ధ్వంసమయ్యాయి.
దండయాత్ర అంటూ…
కానీ రెండు రోజులుగా ఒక వర్గం మీడియాలో మాత్రం జోగి దండయాత్ర అని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును చంపేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే వచ్చారన్న ఆరోపణలు చేస్తున్నారు. గతంలో దేవినేని ఉమ వంటి నేతలు సీఎం జగన్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. టీడీపీ అనుబంధ విభాగమైన టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువతలు కూడా జగన్ ఇంటి ముట్టడికి పిలుపు నిచ్చాయి. వామపక్షాలు కూడా ఇలాంటి పిలుపునే ఇస్తాయి. అయితే అందులో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో సీఎం ఇంటి దరిదాపులకు కూడా వెళ్లలేదు.
అనుకూల మీడియా…
ఇప్పుడు చంద్రబాబు ఇంటి వద్దకు కూడా కిలోమీటర్ దూరంలోనే జోగి రమేష్ తో పాటు కార్యకర్తలు ఉన్నారు. కానీ చంద్రబాబు ఇంటి పైన దాడిగా మీడియా ప్రచారం చేస్తుంది. చంద్రబాబుకే రక్షణ లేకపోతే ఇక సామాన్యులకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తుంది. మొత్తం మీద సంప్రదాయంగా, అనాదిగా వస్తున్న ముట్టడి కార్యక్రమాన్ని దండయాత్ర గా ప్రచారం చేయడంలో టీడీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి.