కాకాణి కేబినెట్ మినిస్టర్ కావడం ఖాయమట.. రీజన్ ఇదే
నిజమే చంద్రబాబు ఎవరిని టార్గెట్ చేస్తే జగన్ వారిని దగ్గరకు తీసుకుంటారు. ఇది గత కొంతకాలంగా అందరూ గమనిస్తున్న విషయమే. అందుకే చంద్రబాబు కు టార్గెట్ అవ్వాలని [more]
నిజమే చంద్రబాబు ఎవరిని టార్గెట్ చేస్తే జగన్ వారిని దగ్గరకు తీసుకుంటారు. ఇది గత కొంతకాలంగా అందరూ గమనిస్తున్న విషయమే. అందుకే చంద్రబాబు కు టార్గెట్ అవ్వాలని [more]
నిజమే చంద్రబాబు ఎవరిని టార్గెట్ చేస్తే జగన్ వారిని దగ్గరకు తీసుకుంటారు. ఇది గత కొంతకాలంగా అందరూ గమనిస్తున్న విషయమే. అందుకే చంద్రబాబు కు టార్గెట్ అవ్వాలని వైసీపీలోని అనేక మంది నేతలు ప్రయత్నిస్తుంటారు. అలాగే పవన్ టార్గెట్ చేసిన వారికి కూడా జగన్ అందలం ఎక్కిస్తారు. దీంతోపాటు సామాజిక సమీకరణాలు కూడా చూస్తారనుకోండి. ఇప్పుడు ఈ జాబితాలో కాకాణి గోవర్థన్ రెడ్డి చేరారంటున్నారు.
అనేక మంది నేతలను…
గతంలో పవన్ కల్యాణ్ కన్నబాబును టార్గెట్ చేశారు. కాకినాడ వెళ్లి మరీ కన్నబాబుపై వ్యక్తిగత విమర్శలు చేసేవారు. అదే కన్నబాబును జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఇక చంద్రబాబు టార్గెట్ లో ఉన్న కొడాలి నానిని కూడా జగన్ దగ్గరకు తీసుకున్నారు. చంద్రబాబు విమర్శలకు జగన్ సత్కారాలతో వారికి చెక్ పెట్టేస్తారనే టాక్ వైసీపీలో బలంగా ఉంది.
ఉప ఎన్నిక పుణ్యమా అని….
తిరుపతి ఉప ఎన్నికల పుణ్యమా అని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి హైలెట్ అయ్యారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిపై చంద్రబాబు, నారాలోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ కాకాణి గోవర్ధన్ రెడ్డి కోట్లు గడిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇక మత్స్యకారులను ఆకట్టుకునేందుకు 43 కోట్లు విడుదల చేస్తూ జీవో తెచ్చారంటూ లోకేష్ కాకాణిపై విరుచుకుపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం ఎలా ఉన్నా కాకాణి గోవర్థన్ రెడ్డి మాత్రం మూడు నాలుగు రోజులు వార్తల్లో నేత అయిపోయారు.
ఈసారి గ్యారంటీ అంటూ….
దీంతో కాకాణి గోవర్థన్ రెడ్డికి ఈసారి మంత్రి వర్గ విస్తరణలో చోటు ఖాయమంటూ వైసీపీలో ప్రచారం జరుగుతుంది. నిజానికి కాకాణి గోవర్థన్ రెడ్డి సీనియర్ నేత. తొలి నుంచి జగన్ ను నమ్ముకున్న లీడర్. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈసారి ఆయనకు జగన్ ఛాన్స్ ఇస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో చంద్రబాబు, లోకేష్ చేసిన విమర్శలు మరింత అవకాశం పెంచినట్లయిందంటున్నారు. సో.. కాకాణి ఈసారి కేబినెట్ మినిస్టర్ ఖాయమట.