కామినేని మళ్లీ కాలుదువ్వుతున్నారా?
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్.. మళ్లీ తనదైన శైలిలో రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారా ? గతంలో 2014లో కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి [more]
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్.. మళ్లీ తనదైన శైలిలో రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారా ? గతంలో 2014లో కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి [more]
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్.. మళ్లీ తనదైన శైలిలో రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారా ? గతంలో 2014లో కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించి.. అప్పటి చంద్రబాబు..బీజేపీ పొత్తులో భాగంగా ఆయన టీడీపీ మంత్రి వర్గంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను చేపట్టారు. కామినేని శ్రీనివాస్ బీజేపీ మంత్రిగా ఉన్నా ఆయన వెంకయ్యనాయుడు, చంద్రబాబు మనిషే. ఆయనలో ఉన్నది టీడీపీ రక్తమే అంటారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా కామినేని శ్రీనివాస్ ఉన్నారు. అయితే, తర్వాత టీడీపీ బీజేపీతో విభేదించిన నేపథ్యంలో మంత్రి వర్గాన్ని వదులుకుని బయటకు వచ్చారు. గత ఏడాది ఎన్నికల్లోపోటీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు.
వెంకయ్య వచ్చినప్పుడే….
నిజానికి కామినేని శ్రీనివాస్ వివాదాస్పద నాయకుడు కాకపోవడంతో పెద్దగా మీడియాలో ఆయన వార్తలు కనిపించవు. కానీ, ఇప్పుడు మరోసారి ఆయన వార్తల్లోకి వచ్చారు. నిజానికి ఎన్నికల తర్వాత పెద్దగా వార్తల్లో ఆయన కనిపించలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్య వచ్చినప్పుడు లేదా ఆయన పాల్గొన్న కార్యక్రమాల్లోనో కామినేని శ్రీనివాస్ కనిపిస్తున్నారు. అంతేతప్ప.. అటు బీజేపీ తరఫున ఇటు వ్యక్తిగతంగా కూడా ఆయన రాజకీయ కార్యక్ర మాల్లోనూ పాల్గొనడం లేదు. దీంతో పెద్దగా కామినేని శ్రీనివాస్ గురించి ఎవరూ చర్చించుకోవడం లేదు. ఇప్పుడు అనూహ్యంగా ఆయన మరోసారి వార్తల్లోకి వచ్చారు.
హైకోర్టులో పిటీషన్లు వేస్తూ….
తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు కోర్టుకు వెళ్లారు. దీంతో వీరికి అనుకూలంగానే హైకోర్టు తీర్పు చెప్పింది. వీరిలో కామినేని శ్రీనివాస్ కూడా ఒకరు. ఈయన వేసిన పిటిషన్ వరకు ఓకే. కానీ, దీనివెనుక రాజకీయం ఉందనే వ్యాఖ్యలు రావడంతో ఆసక్తిగా మారింది. జనసేన కూడా తెలుగు మీడియంపై పోరాడుతోంది. మన నుడి పేరుతో ఇప్పటికే జనసేనాని కార్యక్రమాలు కూడా చేపట్టారు. గతంలోనూ ప్రజారాజ్యం తరఫున జైకొట్టిన కామినేని శ్రీనివాస్ ఇప్పుడు జనసేనకు అనుకూలంగానే కోర్టుకు వెళ్లారనే వాదన వినిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై కూడా కామినేని శ్రీనివాస్ కోర్టుకు వెళ్లారు.
జనసేనాని ప్రోత్సాహంతో…..
వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ-జనసేన ఒకే తాటిపై ఉన్నాయి. సో.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్పటికీ.. కామినేనిని జనసేనాని ప్రోత్సహించారని, అందుకే ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. కైకలూరు నియోజకవర్గంపై కామినేనికి ఎలాగూ పట్టున్న నేపథ్యంలో కామినేని శ్రీనివాస్ భవిష్యత్తు రాజకీయం కోసం లేదా ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం వస్తే కైకలూరు సీటుపై కన్నేసి ఆయన బీజేపీలో ఉంటూనే జనసేన తరపున కూడా రాజకీయం చేస్తున్నారన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.