కరణం అక్కడ చేరి వేస్టేనా..? ఆమంచికే ప్రయారిటీ

కరణం బలరాం వైసీపీకి మద్దతిచ్చారు. తెలుగుదేశంపార్టీ గుర్తు మీద గెలిచిన కరణం బలరాం ఇటీవల తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం వైసీపీకి జై కొట్టారు. అసలు [more]

Update: 2020-06-08 02:00 GMT

కరణం బలరాం వైసీపీకి మద్దతిచ్చారు. తెలుగుదేశంపార్టీ గుర్తు మీద గెలిచిన కరణం బలరాం ఇటీవల తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం వైసీపీకి జై కొట్టారు. అసలు కరణం బలరాంను వైసీపీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ అధినాయకత్వం అసలు ఇష్టపడలేదు. గొట్టి పాటి రవికుమార్ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఆయన రానని చెప్పేయడంతోనే కరణం బలరాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.

చీరాలలో పట్టుండటంతో….

ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గంలో వైసీపీకి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయినా అక్కడ ఆమంచి కృ‌ష్ణమోహన్ వంటి నేత ఉన్నారు. అయితే అద్దంకి, పర్చూరు వంటి ప్రాంతాల్లో వైసీీపీకి బలమైన నాయకత్వం లేదు. అందుకే అద్దంకి కోసమే కరణం బలరాంను పార్టీలో చేర్చుకున్నారన్న టాక్ వినపడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి కరణం బలరాం ఫ్యామిలీని అద్దంకి పంపే ప్రయత్నమే.

ఆధారాలతో సహా…..

అయితే ప్రస్తుతం కరణం బలరాం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ వైసీపీ ఇన్ ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. ఇద్దరికీ పడటం లేదు. ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమంచి కృష్ణమోహన్ ముఖ్యమంత్రి జగన్ ను కలసి నియోజకవర్గ పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. కరణం బలరాం టీడీపీ కార్యకర్తలకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమంచి ఆరోపించారు. ఇందుకు ఆధారాలతో సహా ఆమంచి జగన్ కు వివరించినట్లు తెలిసింది. టీడీపీ నేత ఇల్లీగల్ గా రిసార్ట్ నిర్వహిస్తుంటే అతనికి అధికారులు నోటీసులు ఇస్తే కరణం బలరాం అధికారులను బెదిరించారని ఆమంచి జగన్ కు తెలిపారు. అలాగే టీడీపీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని కరణం బలరాం అధికారులపై వత్తిడి తెస్తున్నట్లు ఆధారాలతో సహా జగన్ ముందు ఆమంచి ఉంచారని సమాచారం.

జగన్ క్లారిటీ ఇచ్చారా?

దీంతో జగన్ ఆమంచికి క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. క్యాడర్ కు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్పినట్లు తెలిసింది. వైసీపీ ఇన్ ఛార్జిగా ఆమంచి ఉంటారని కూడా హామీ జగన్ ఇచ్చారంటున్నారు. అంతేకాకుండా ఏదైనా బదిలీలు, వాలంటీర్ల నియామకం వంటి విషయాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పినట్లు తెలిసింది. పార్టీకి ఇబ్బంది కలగకుండా సజ్జల చూసుకుంటారని కూడా జగన్ ఆమంచి హామీ ఇచ్చారంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నా చీరాల నియోజకవర్గంలో కరణం బలరాం చెప్పినట్లు నడవదన్న సంకేతాలు పార్టీ అధిష్టానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News