సభ సమావేశమయ్యే లోపు…??
ఈ నెల 12వ తేదీ నుంచి కర్ణాటక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభమయ్యే లోపుగానే కర్ణాటకలో ప్రభుత్వం తలకిందులవుతుందా? లేదా సంకీర్ణ సర్కార్ నిలదొక్కుకుంటుందా? అన్నది [more]
ఈ నెల 12వ తేదీ నుంచి కర్ణాటక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభమయ్యే లోపుగానే కర్ణాటకలో ప్రభుత్వం తలకిందులవుతుందా? లేదా సంకీర్ణ సర్కార్ నిలదొక్కుకుంటుందా? అన్నది [more]
ఈ నెల 12వ తేదీ నుంచి కర్ణాటక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభమయ్యే లోపుగానే కర్ణాటకలో ప్రభుత్వం తలకిందులవుతుందా? లేదా సంకీర్ణ సర్కార్ నిలదొక్కుకుంటుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ్యులు ఆనంద్ సింగ్, రమేష్ జార్ఖిహోళిలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరు తమ రాజీనామాలను స్పీకర్ తో పాటుగా గవర్నర్ కు కూడా పంపడం విశేషం. గవర్నర్ కు పంపడంలోనే ఇందులో కమలం పార్టీ హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రాహుల్ తో టచ్ లో…..
కాంగ్రెస్ అగ్రనేతలు సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ లు పరిస్థిితిని ఎప్పటికప్పుడు హైకమాండ్ కు నివేదిస్తున్నారు. పీసీీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు విదేశాలకు వెళ్లడంతో ఎమ్మెల్యేల సంరక్షణ బాధ్యతను సిద్ధరామయ్య, పరమేశ్వర్ లు మాత్రమే తీసుకున్నారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. రాహుల్ గాంధీతో నేరుగా వీరిద్దరూ టచ్ లో ఉండి పరిస్థితులను చెబుతున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్లను ప్రకటించడానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమయినట్లు తెలుస్తోంది.
తాము దూరం అంటున్న….
భారతీయ జనతా పార్టీ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుంది. గతంలో తాము చేపట్టిన ఆపరేషన్ కమల్ విఫలం కావడంతో ఈసారి తొందరపడకూడదని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ శాసనసభ్యులు తమంతట తామే బయటకు వచ్చి బీజేపీలో చేరతామంటే అందుకు ఎప్పుడూ ద్వారాలు తెరిచి ఉంటాయని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప చెబుతున్నారు. తమకు ప్రభుత్వాన్ని కూలదోసే ఆలోచన లేదని, దానంతట అది కూలిపోతే తాము అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తామంటున్నారు యడ్డీ.
సమావేశాల్లోపే……
అయితే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల వెనక బీజేపీ అగ్రనేతల హస్తం ఉందన్న అనుమానాలు లేకపోలేదు. మోదీ, అమిత్ షా వంటి వారి నుంచి స్పష్టమైన హామీ లభించబట్టే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామ చేశారన్నది కాంగ్రెస్ నేతల అనుమానం. మరికొందరు కూడా వారి బాటలో పయనించే అవకాశముండటతో రానున్న శాసనసభ సమావేశాల్లోపు ప్రభుత్వం కూలిపోతుందన్న అనుమానం కూడా లేకపోలేదు. అందుకే కాంగ్రెస్, జేడీఎస్ లు అప్రమత్తమయ్యాయి. అయినా ఏదో జరుగుతుందన్న అనుమానం మాత్రం రెండు పార్టీల అగ్రనేతల్లో లేకపోలేదు.