పంచాయతీ పోరు…. కొడాలి నానికి ఇబ్బందేనా ?
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వీటిని సవాలుగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ విషయానికి వస్తే.. [more]
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వీటిని సవాలుగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ విషయానికి వస్తే.. [more]
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా వీటిని సవాలుగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ విషయానికి వస్తే.. అంతర్గతంగా ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు. మరీ ముఖ్యంగా మంత్రులకు ఈ బాధ్యత అప్పగించారని తెలుస్తోంది. కేబినెట్ ఏర్పడిన తర్వాత.. వచ్చిన ఎన్నికలు ఇవే కావడం.. జగన్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెడుతుండడంతో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని మంత్రి కొడాలి నాని ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు.
ఏకగ్రీవం చేసుకోవాలని…
జిల్లాలోని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుని..తనకు తిరుగులేదని నిరూపించుకునేందుకు మంత్రి కొడాలి నాని రెడీ అయ్యారు. అయితే.. ఇప్పుడు అసలు విషయం తెలిసి.. మంత్రి గారు తలపట్టుకుంటున్నారు. గతంలో ఉన్నట్టు ఇప్పుడు కొడాలి నానికి అనుకూల పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు.. మంత్రికి వ్యతిరేక పవనాలు వీచేలా చేస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా నాని అడ్డాలో ఆయనకు తెలియకుండానే పేకాట స్థావరాలపై భారీ స్థాయిలో జరిగిన దాడులు విషయం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ గుడివాడలో పర్యటించి.. చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పేకాట కారణంగా.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఇప్పటి వరకు దీని వెనుక మంత్రి కొడాలి నాని ఉన్నారనే విషయం వారికి తెలిసినా.. తెలియకపోయినా.. ఇటీవల పవన్ చేసిన కామెంట్లు మాత్రం గట్టి ప్రభావాన్నే చూపించాయి. ఇక గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని వరుసగా నాలుగు సార్లు గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేని దుస్థితి.
కొందరికే అందుబాటులో…..
ఇటీవల గుడివాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు చేస్తోన్న భారీ అవినీతి కూడా స్థానిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్థానికంగా పల్లెల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. దీంతో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మంత్రి కొడాలి నాని అంటే.. ఒకింత వ్యతిరేక భావన కనిపిస్తోంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లోనూ మంత్రి దూకుడు చూపించాలని అనుకుంటున్నా.. ఇదే విషయం చర్చనీయాంశంగా ఉండడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వస్తోందని అంటున్నారు. పైగా ఇప్పటి వరకుమంత్రి గా ఆయన కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్నారు. కానీ, ఇప్పుడు పంచాయతీ లెవెల్‌కు వచ్చే సరికి పరిణామాలు వేరేగా ఉన్నాయి.
డేగకన్నుతో పరిశీలన…
పైగా.. ఎన్నికల కమిషనర్ కూడ గుడివాడపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గం పరిధిలో జరిగే పంచాయతీ ఎన్నికలను డేగకన్నుతో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొడాలి అనుచరులు ఎవరికివారు దూరమయ్యారు. ఎన్నికలు అయ్యాక మళ్లీ యాక్టివ్ అవుదామని అనుకున్నారు. దీంతో మంత్రి కొడాలి నానికి పంచాయతీ ఎన్నికలు పెద్ద పరీక్షే పెట్టనున్నాయనిఅంటున్నారు పరిశీలకులు.