కొడాలి నాని విష‌యంలో బాబు తప్పు చేశారా?

టీడీపీ పేరెత్తితే చాలు మంత్రి కొడాలి నాని శివాలెత్తిపోతారు. చంద్రబాబును, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ను, దేవినేని ఉమాను ఆయ‌న ఎలా టార్గెట్ చేసుకుని బండ బూతులు తిడ‌తారో [more]

Update: 2021-02-23 00:30 GMT

టీడీపీ పేరెత్తితే చాలు మంత్రి కొడాలి నాని శివాలెత్తిపోతారు. చంద్రబాబును, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ను, దేవినేని ఉమాను ఆయ‌న ఎలా టార్గెట్ చేసుకుని బండ బూతులు తిడ‌తారో ? ప‌్రత్యేకంగా చెప్పక్క‌ర్లేదు. 40 సంవ‌త్సరాల సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉండి కూడా చంద్రబాబు కొడాలి నాని దూకుడుకు గుడివాడ‌లో బ్రేకులు వేయ‌లేక‌పోతున్నారు. క‌నీసం అక్కడ పార్టీకి ఓ బ‌ల‌మైన నేత‌ను కూడా సెట్ చేయ‌లేక పోతున్నారు. ఎలాంటి రాజకీయ విమర్శలు అయినా తట్టుకోవచ్చు కానీ… కొడాలి నాని చంద్రబాబు వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని దారుణమైన విమర్శలు చేస్తుంటారు. కొడాలి నానిపై విమర్శలు చేయడంలో టిడిపి సీనియర్లు పూర్తిగా విఫలమవుతున్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్‌పై, వైసీపీపై సైతం ఘాటైన విమర్శలు చేసినా.. కొడాలి నానిని కాస్త ఘాటుగా విమర్శించేందుకు భయపడుతున్నారా ? అన్నట్టుగా ఆయ‌న వ్యవహరిస్తున్నారు. ఉమా కొడాలి నానిపై ఎంత ఘాటైన పంచ్‌లు వేసినా కిక్ ఉండ‌డం లేదు.. అదే కొడాలి తిరిగి మాట్లాడుతుంటే ఉమా ప‌రువు పూర్తిగా తీసేస్తున్నారు.

కట్టడి చేయాలనుకున్నా…..

ఇక కొడాలి నానిని ఎదుర్కొనే విషయంలో టిడిపి సీనియర్లు పూర్తిగా చేతులు ఎత్తేస్తోంటే చివ‌ర‌కు జూనియ‌ర్లు ఆయ‌న విమ‌ర్శల‌కు ఘాటైన కౌంట‌ర్లు ఇస్తూ బెట‌ర్ అనిపిస్తున్నారు. ప‌ట్టాభి లాంటి వాళ్లు ఘాటుగా మాట్లాడ‌డంతోనే త‌న‌ను నాని టార్గెట్ చేశార‌ని చెప్పుకున్నారంటే కొడాలి నానిపై చేసే పోరాటంలో టీడీపీ జూనియ‌ర్లనే బెట‌ర్ అనుకోవ‌చ్చు. నానిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంత క‌ట్టడి చేయాల‌ని ప్రయ‌త్నించినా అది సాధ్యం కాద‌ని.. పైగా ఆయ‌న్ను టార్గెట్ చేసేకొద్ది మ‌రింత‌గా రెచ్చిపోయి… ఓ వ‌ర్గంలో తిరుగులేని హీరో అయిపోతున్నాడ‌న్న నిర్ణయానికి బాబు వ‌చ్చేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

గుడివాడ టీడీపీలో గ్రూపు త‌గాదాలు ?

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నానిని క‌ట్టడి చేసేందుకు బ‌ల‌మైన నేత‌కు ప‌గ్గాలు ఇచ్చి ఉంటే ఈ రోజు గుడివాడ‌లో పార్టీకి ఈ దుస్థితి వ‌చ్చేదే కాద‌ని ప‌లువురు నేత‌లు వాపోతున్నారు. నాడు చంద్రబాబు ఉదాసీన వైఖ‌రితో ఉన్నారు. నాడు టీడీపీలో ప్రస్తుత ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వర‌రావు, పిన్నమ‌నేని ఫ్యామిలీ, య‌ల‌వ‌ర్తి వెంక‌టేశ్వర‌రావు లాంటి నేత‌ల మ‌ధ్య స‌ఖ్యత కుద‌ర్చలేదు స‌రిక‌దా ? కొడాలి నానికి పోటీలో స‌రితూగ‌ని ఈ నేత‌ల‌ను న‌మ్ముకుని ఉన్నారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు ముందు విజ‌య‌వాడ నుంచి అవినాష్‌ను తీసుకు వ‌చ్చి పోటీ చేయించినా ఉప‌యోగం లేదు. అవినాష్ పార్టీ వీడిపోవ‌డంతో ఇప్పుడు రావి వెంక‌టేశ్వరావుకు పార్టీ ప‌గ్గాలు ఇవ్వడంతో పార్టీ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది.

రావినే న‌మ్ముకున్న ఉమా ?

కొడాలి నాని ప‌దే ప‌దే త‌న‌ను టార్గెట్ చేస్తుండ‌డంతో మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావు సైతం గుడివాడ‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టక త‌ప్పని ప‌రిస్థితి. రావికి తిరిగి ఇన్‌చార్జ్ ప‌ద‌వి ద‌క్కడం వెన‌క ఉమాయే చ‌క్రం తిప్పార‌ని రావిని వ్యతిరేకించే వ‌ర్గం నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా కాకుండా.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉమా.. అటు చంద్రబాబు గుడివాడ‌పై ఫోక‌స్ పెట్టి ఉంటే ఈ రోజు వీళ్లు ఇన్నీ బూతులు తిట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఉండేదే కాద‌ని… గుడివాడ‌లో కొడాలి నానిని ఢీకొట్టే బ‌ల‌మైన నేత టీడీపీకి దొరికి ఉండేవాడ‌ని ప‌లువురు తెలుగు త‌మ్ముళ్లు చెవులు కొరుక్కుంటోన్న ప‌రిస్థితి.

Tags:    

Similar News