కొడాలి నాని కావాలని కెలుక్కున్నట్లుందే?

బాబోయ్ ఇంత డ్యామేజింగ్ కామెంట్ ఎవరు చేశారు. కాంగ్రెస్ నా ..లేక‌ కమ్యూనిస్టు పార్టీనా…కాకపోతే మమతా బెనర్జీనా. అంటే వారెవరూ కాదు, మోడీతో ఇండైరెక్ట్ గా దోస్తీ [more]

Update: 2020-08-11 08:00 GMT

బాబోయ్ ఇంత డ్యామేజింగ్ కామెంట్ ఎవరు చేశారు. కాంగ్రెస్ నా ..లేక‌ కమ్యూనిస్టు పార్టీనా…కాకపోతే మమతా బెనర్జీనా. అంటే వారెవరూ కాదు, మోడీతో ఇండైరెక్ట్ గా దోస్తీ చేస్తున్న వైసీపీకి చెందిన మంత్రి ఇంత ఘాటైన మాట వాడేశారు. కరోనాతో పోలిక పెడుతూ మరీ బీజేపీని అరవీర రాజకీయ భయంకరిని చేశారు. నిజంగా ఈ కామెంట్స్ కనుక బీజేపీ పెద్దలు సీరియస్ గా తీసుకుంటే మొత్తం ఏపీలో రాజకీయ సమీకరణలే మారిపోతాయి. పైగా జగన్ కి సన్నిహితుడని పేరున్న కొడాలి నాని ఈ కామెంట్స్ చేయడంతో కధ ఏ వైపు మలుపు తిరుగుతుందో అన్న చర్చ సాగుతోంది.

సోకితే అంతే…..

కరోనా చైనా నుంచి వచ్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. సోకితే ఏకంగా ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఇపుడు జనమంతా కరోనా పేరు వింటేనే వణికిపోతున్నారు. ఈ సమయంలో ప్రాణాంతకి కరోనాతో పోలుస్తూ బీజేపీ మీద రాజకీయ బాణాలు వేయడం అవసరమా. బీజేపీ రాజకీయం కరోనాలా ఉంటుందని మెల్లగా వచ్చి మొత్తం కబళించేస్తుందని కొడాలి నాని భాష్యం చెప్పుకొచ్చారు. ఏపీలో కూడా బీజేపీ కరోనా విస్తరించిందని, అది టీడీపీని కబలిస్తోందని కూడా ఆయన అంటున్నారు. చంద్రబాబు చైనా కరోనాకు భయపడి హైదరాబాద్ లో ఉన్నారని, కానీ ఇండియా కరోనా బీజేపీ ఏకంగా ఆయన పార్టీనే లాగేస్తోందని నాని వివరిస్తున్నారు.

వైసీపీకి నో ఫికర్…

అదే సమయంలో బీజేపీ కరోనా తమ పార్టీని ఏమీ చేయలేదని నాని అంటున్నారు. తమ నాయకుడు జగన్ అతి బలవంతుడని, చైనా కరోనావే కాదు, ఇండియా కరోనా బీజేపీ కూడా తమకు సోకేందుకే భయపడతాయని కొడాలి నాని విశ్లేషిస్తున్నారు. టీడీపీ అత్యంత బలహీనపడిపోయిందని, దాని వ్యాధి కూడా ముదిరిందని, దాన్ని నయం చేయడానికి కూడా మందులు ఏవీ లేవని అంటున్నారు. అందువల్ల బీజేపీ సులువుగా టీడీపీని కబ‌లించి ఖతం చేయడం ఖాయమని కొడాలి నాని భవిష్యత్తు కూడా చూపించేశారు.

ఇబ్బందేనా …?

ఇపుడు కేంద్ర స్థాయిలో బీజేపెతో వైసీపీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. మోడీ కూడా జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు. ఏపీలో చూసుకుంటే సోము వీర్రాజు కూడా వైసీపీ మీద అయిన దానికి కాని దానికి ఏమీ అనడంలేదు, పైగా ఆయన తన టార్గెట్ టీడీపీ అని చెప్పేశారు. ఇలా సాఫీగా ఉన్న పొలిటికల్ వాతావరణాన్ని కోరి మరీ కెలుక్కున్నట్లుగా కొడాలి నాని బీజేపీ మీద హాట్ కామెంట్స్ చేశారా అన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. పైగా బీజేపీ దేశంలోని ఇతర పార్టీలను కబ్జా చేసే పార్టీగా నాని మాటలు ఉన్నాయి. మరి ఈ విషయంలో కమలనాధుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News