పెద్దాయనకు పాపం ఎంత కష్టమొచ్చింది
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రపార్టీలని తిట్టిన నోటితోనే అదే పార్టీలను పొగడాల్సి వస్తుంది. ఆ పార్టీల మద్దతునే ఇప్పుడు పొందాల్సి వస్తుంది. ప్రొఫెసర్ కోదండరామ్ పడుతున్న కష్టాలను [more]
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రపార్టీలని తిట్టిన నోటితోనే అదే పార్టీలను పొగడాల్సి వస్తుంది. ఆ పార్టీల మద్దతునే ఇప్పుడు పొందాల్సి వస్తుంది. ప్రొఫెసర్ కోదండరామ్ పడుతున్న కష్టాలను [more]
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రపార్టీలని తిట్టిన నోటితోనే అదే పార్టీలను పొగడాల్సి వస్తుంది. ఆ పార్టీల మద్దతునే ఇప్పుడు పొందాల్సి వస్తుంది. ప్రొఫెసర్ కోదండరామ్ పడుతున్న కష్టాలను చూసి ఆ పార్టీ నేతలే ఫీలవుతున్నారట. ప్రొఫెసర్ కోదండరామ్ త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ జనసమితి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోనూ నిర్ణయించారు.
అన్ని పార్టీలతో సంప్రదింపులు…
అయితే ఆయన అన్ని పార్టీలతో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, కమ్యునిస్టు పార్టీల నేతలను కలసి తన పోటీపై కోదండరామ్ చర్చలు జరిపారు. తనకు మద్దతివ్వాలని కోరారు. గత శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవడాన్ని వారికి దృష్టి కి తెచ్చి పార్టీల తరుపున అభ్యర్థులను నిలపవద్దంటూ కోదండరామ్ అభ్యర్థిస్తున్నారు. కోదండరామ్ కు కమ్యునిస్టులు, టీడీపీ మద్దతిచ్చేందుకు అంగీకరించింది. కాంగ్రెస్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు.
ఇదే సేఫ్ ప్లేస్….
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల శాసనమండలి స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలో పోటీ చేసి తాను మండలిలో అడుగు పెట్టాలన కోదండరామ్ గట్టిగా నిర్ణయించుకున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ రెండు సార్లు గెలిచారు. ప్రస్తుతం పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది గెలిచే సీటుగా కోదండరామ్ భావిస్తున్నారు. ప్రధానంగా వరంగల్ జిల్లాలో తనకున్న పట్టుతో ఆధిక్యత సాధించే అవకాశముందన్న అంచనాలో ఉన్నారు.
అందరి మద్దతుతో…..
ఇక ఖమ్మం జిల్లాలో కమ్యునిస్టులు, టీడీపీ బలంగా ఉన్నాయి. దీంతో ఆ పార్టీల సహకారం ఈ జిల్లాలో తీసుకోవచ్చన్నది కోదండరామ్ ఆలోచన. వీటితో పాటు కాంగ్రెస్ కూడా మద్దతిస్తే కోదండరామ్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. అయితే అధికార పార్టీ అభ్యర్థి ఎవరిని నిలబెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించనుంది. మొత్తం మీద కోదండరామ్ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ గడపలను తొక్కడం ప్రస్తుతం అందరూ చర్చించు కుంటున్నారు. ఆయనకు ఒకసారి అవకాశమివ్వాలన్నది అందరి అభిప్రాయంగా ఉంది.