కన్నబాబుకు అందుకే ప్రయారిటీ
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఇటీవల కాలంలో సెంటరాఫ్‌ది టాపిక్‌గా కనిపిస్తున్న నాయకుడు, మంత్రి కురసాల కన్నబాబు. వైసీపీ నుంచి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించిన [more]
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఇటీవల కాలంలో సెంటరాఫ్‌ది టాపిక్‌గా కనిపిస్తున్న నాయకుడు, మంత్రి కురసాల కన్నబాబు. వైసీపీ నుంచి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించిన [more]
తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఇటీవల కాలంలో సెంటరాఫ్‌ది టాపిక్‌గా కనిపిస్తున్న నాయకుడు, మంత్రి కురసాల కన్నబాబు. వైసీపీ నుంచి కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించిన ఆయన వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆదిలో పెద్దగా దూకుడు ప్రదర్శించకపోయినా.. ఇటీవల కాలంలో ప్రభుత్వం తరపున గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధిస్తున్న విమర్శలకు ధీటుగా ఆయన సమాధానం చెబుతున్నారు. నిజానికి ఇదే జిల్లా నుంచి సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిగా ఉన్నారు.
సీనియర్ అయిన….
బోస్ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా.. జగన్ ఆయనకు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవిని కట్టబెట్టారు. అయినా కూడా ఆశించిన విధంగా బోస్ పార్టీ తరఫున గళం వినిపించలేక పోతున్నారనే వాదన ఉంది. అదే సమయంలో ఇదే జిల్లా నుంచి ఎంతో ఆశతో టీడీపీకి చెందిన తోట త్రిమూర్తులును జగన్ పార్టీలోకి తీసుకున్నారు. ఈయన కూడా ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చింది లేదు. ఇక, మిగిలిన నాయకులు కూడా అంతగా దూకుడు ప్రదర్శించడం లేదు. ఈ నేపథ్యంలో కన్నబాబు సెంటర్‌గా జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు నడుస్తున్నాయి.
ఇద్దరు మంత్రలున్నప్పటికీ…..
గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కొని కన్నబాబు కాపుల్లో పార్టీ తరపున మంచి నేతగా గుర్తింపు పొందారు. కాపు నేపథ్యం ఉన్న నాయకుడు, వివాద రహితుడు కావడం, సౌమ్యుడనే ముద్ర పడడం కూడా కురసాలకు కలిసి వస్తున్న అంశం. దూకుడుగా మాట్టాడేవారు పార్టీలో ఎవరున్నారా? అని వెతుకుతున్న తరుణంలో .. కన్నబాబు అనూహ్యంగా తెరమీదికి రావడం, ఆయనను జగన్ కూడా ప్రోత్సహించడం పార్టీకి కలిసివస్తోంది. అటు జిల్లాలో జగన్‌కు బలమైన మంత్రి బోస్‌తో పాటు మరో మంత్రి విశ్వరూప్ ఉన్నా కూడా జగన్ కన్నబాబుకే ప్రయార్టీ ఇస్తున్నారు. అటు పవన్ సైతం తన సామాజికవర్గానికే చెందిన వ్యక్తి కావడంతో పవన్‌కు అన్ని విధాలా కౌంటర్లు ఇస్తున్నారు.
శాఖాపరంగానూ….
ఇటు శాఖా పరంగాను మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. ఏపీ రాజకీయాలను శాసించే బలమైన కాపు నేతలు ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు కన్నబాబు ఆ సామాజికవర్గంలోనే కాకుండా.. జిల్లా రాజకీయాల్లోనూ కీలకనేతగా మారిపోయారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ముచ్చెమటలు పట్టించే రేంజ్‌లో కన్నబాబు దూకుడుగా మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలు గమనిస్తున్న తూర్పు నేతలు.. రాబోయే రోజుల్లో కన్నబాబు కు మరింత ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు.