కన్నబాబు నెత్తిన పెద్ద బాధ్యతలు ?

పాత్రికేయునిగా జీవితాన్ని ప్రారంభించి ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గిన కురసాల కన్నబాబు గోదావరి జిల్లాలలో యువ తరంగం అనే చెప్పాలి. తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గినపుడే [more]

Update: 2021-01-10 05:00 GMT

పాత్రికేయునిగా జీవితాన్ని ప్రారంభించి ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గిన కురసాల కన్నబాబు గోదావరి జిల్లాలలో యువ తరంగం అనే చెప్పాలి. తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గినపుడే ఆయన అటు వైఎస్సార్ ఇటు చంద్రబాబుల మధ్యన నిలబడి అనర్గళంగా చేసిన ప్రసంగాలు అందరికీ ఆకట్టుకున్నాయి. ఆ తరువాత వైసీపీలో చేరిన కురసాల కన్నబాబు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీతో కాకినాడ రూరల్ నుంచి గెలవడమే కాదు కీలకమైన వ్యవసాయ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తూ జగన్ మన్ననలు అందుకుంటున్నారు.

సెటైర్లలో దిట్ట ….

కురసాల కన్నబాబుకు రాజకీయ నేపధ్యంలో పాటు పాత్రికేయ నేపధ్యం కూడా ఉండడం వల్ల ఆయన వేసే పంచులు ప్రసంగాలు అదిరిపోతాయి. దానికి గోదావరి యాసను కూడా జోడించి కన్నబాబు టీడీపీ మీద విరుచుకుపడితే తమ్ముళ్ళ మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఒక విధంగా కన్నబాబు జగన్ కి పెద్ద అసెట్ అని చెప్పాలి. పాతిక మంది మంత్రుల్లో టాప్ ఫైవ్ లో ఉన్న యువ మంత్రిగా కన్నబాబు చాలా బాగా రాణిస్తున్నారు.

ఏపీ ప్రెసిడెంట్ గా….

ఇక కురసాల కన్నబాబుకు జగన్ కొత్త బాధ్యతలు అప్పగిస్తారు అంటున్నారు. వైసీపీ ఏపీ ప్రెసిడెంట్ గా కన్నబాబుని నియమిస్తే ఎలా ఉంటుంది అన్నది జగన్ మార్క్ ఆలోచనట. గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ మంచి సీట్లు సాధించింది. కాపులు వైసీపీ వైపు నాడు పెద్ద ఎత్తున మొగ్గు చూపారు. ఇపుడు రాజకీయం కాస్తా మారుతోంది. కాపులను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ కాపు కార్డ్ తీసింది. సోము వీర్రాజుకు ఏపీ ప్రెసిడెంట్ పదవి అప్పగించింది. జనసేనకు ఎటూ పవన్ కళ్యాణ్ ఆ సామాజిక వర్గం ప్రతినిధిగా ఉన్నారు. బీసీ నేతను ఏపీ ప్రెసిడెంట్ గా టీడీపీ చేసింది. దాంతో సామాజిక వర్గ సమీకరణలతో పాటు ప్రాంతీయ తూకాన్ని కూడా సరిచూసుకుని మరీ జగన్ కురసాల కన్నబాబుని ఏపీ అధ్యక్షుడిని చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది.

ఇక దూకుడుగా ….

పార్టీ బాధ్యతల బరువుని జగన్ ఈ విధంగా దించుకుంటారని అంటున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా మరింత ఫోకస్ గా ప్రభుత్వం మీద దృష్టి సారిస్తారు అని అంటున్నారు. ఇక కురసాల కన్నబాబు లాంటి యువనేత సారధ్యంలో పార్టీ పరుగులు తీస్తుందని కూడా జగన్ గట్టిగా నమ్ముతున్నారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారు. గోదావరి జిల్లా నుంచి పార్టీ ప్రెసిడెంట్ ఉంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో పార్టీ బలపడుతుందని కూడా ఈ ప్లాన్ వేసినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో విశాఖను పాలనారాజధానిగా చేసినందున ఆ మొగ్గు కూడా ఉంటుందని మొత్తానికి వైసీపీకి అన్ని విధాలుగా కలసి వస్తుందనే కురసాల కన్నబాబు ని జగన్ తన చాయిస్ గా ఎంచుకుంటున్నారని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News