అదే నిజమైతే జూన్ వరకూ తప్పదా?
ఏప్రిల్ 14 వ తేదీ వరకూ లాక్ డౌన్ ను ఇండియాలో విధించారు. పదిహేనో తేదీ తర్వాత నుంచి లాక్ డౌన్ దశల వారీగా తొలగించాలని కేంద్ర [more]
ఏప్రిల్ 14 వ తేదీ వరకూ లాక్ డౌన్ ను ఇండియాలో విధించారు. పదిహేనో తేదీ తర్వాత నుంచి లాక్ డౌన్ దశల వారీగా తొలగించాలని కేంద్ర [more]
ఏప్రిల్ 14 వ తేదీ వరకూ లాక్ డౌన్ ను ఇండియాలో విధించారు. పదిహేనో తేదీ తర్వాత నుంచి లాక్ డౌన్ దశల వారీగా తొలగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పుడు బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు ఇచ్చిన రిపోర్ట్ కలకలం రేపుతుంది. జూన్ నెల వరకూ భారత్ లో లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశముందని ఆ నివేదికలో పేర్కొనడం సంచలనంగా మారింది. ఇప్పటికే లాక్ డౌన్ ను పొడిగిస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.
గత నెల 24వ తేదీ నుంచి….
గత నెల 24వ తేదీ నుంచి భారత్ లో లాక్ డౌన్ కొనసాగుతుంది. అన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నాయి. తొలుత మార్చి 31వ తేదీ వరకూ లాక్ డౌన్ ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత పరిస్థితి తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ ను ఏప్రిల్ 14వ తేదీ వరకూ కొనసాగించాలని నిర్ణయించింది. పది రోజుల నుంచి లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారసంస్థలు కూడా మూతబడటంతో ఉపాధి లేక అనేకమమంది ఆకలితో అలమటిస్తున్నారు.
ఆర్థిక పరిస్థితి మరింతగా….
దీంతో పాటు లాక్ డౌన్ తో రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిపోయంది. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లోనూ ప్రధాని మోదీకి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్థిక సాయాన్ని కోరారు. పన్నులు వసూళ్లు లేకపోవడం, కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండటంతో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి. మరికొంత కాలం లాక్ డౌన్ ను కొనసాగిస్తే పరిస్థితి మరింత దిగిజారిపోనుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తి వేయాలని భావిస్తుంది.
బీసీజీ నివేదికతో….
ఈ నేపథ్యంలో బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ఇచ్చిన నివేదిక కలకలం రేపుతోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్ డౌన్ మే చివరి వరకూ కాని, జూన్ నెలాఖరు వరకూ గాని పొడిగించే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఇప్పటికే భారత్ లో మూడు వేలకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకోవడంతో లాక్ డౌన్ ను తొలగిస్తే కరోనాను కంట్రోల్ చేయడం కష్టసాధ్యమని నివేదిక పేర్కొంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.