వారి మధ్యలో ఈయన నలిగిపోతున్నారా?

ఆయ‌న ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యే. అసెంబ్లీకి పోటీ చేసిన తొలి ప్రయ‌త్నంలో ద‌గ్గర‌కు వ‌చ్చి ఓడిపోయి.. రెండో ప్రయ‌త్నంలో గెలిచారు. అయితే ఎమ్మెల్యే అయిన రెండేళ్లకే ఆయ‌న [more]

Update: 2021-05-12 15:30 GMT

ఆయ‌న ఫ‌స్ట్ టైమ్ ఎమ్మెల్యే. అసెంబ్లీకి పోటీ చేసిన తొలి ప్రయ‌త్నంలో ద‌గ్గర‌కు వ‌చ్చి ఓడిపోయి.. రెండో ప్రయ‌త్నంలో గెలిచారు. అయితే ఎమ్మెల్యే అయిన రెండేళ్లకే ఆయ‌న రాజ‌కీయం మారిపోయింది. సీన్ రివ‌ర్స్ అయిపోయింది. అస‌లు విష‌యంలోకి వెళితే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అది కూడా వైసీపీ నుంచి బ‌ల‌మైన గాలులు, జ‌గ‌న్‌ సునామీ ఉన్న నేప‌థ్యంలో టీడీపీ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన మ‌ద్దాలి గిరిధ‌ర్ విజ‌యం సాధించారు. స‌రే! ఇంత ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న‌కు టీడీపీలో వెంట‌నే గుర్తింపు రావాల‌ని కోరుకున్నారు. ఇది సాధ్యమేనా? సీనియ‌ర్ల క‌బంద హ‌స్తాల్లో చిక్కుకున్న పార్టీలో ఇలాంటి జూనియ‌ర్‌కు వెంట‌నే గుర్తింపు ల‌భించ‌డం క‌ష్టం. కానీ, మ‌న ఎమ్మెల్యే ఆశించారు. అది జ‌ర‌గ‌లేదు.

వైసీపీలో చేరిపోయి…..

దీంతో వెంట‌నే మ‌ద్దాలి గిరిధ‌ర్ వైసీపీలోకి చేరిపోయారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న గెలిచి రెండేళ్లు అయిపోయాయి. త‌న వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ అండ‌దండ‌లు కూడా త‌న‌కు పుష్కలంగా ఉంటాయ‌ని ఆయ‌న ఆశించారు. ఎమ్మెల్యేగా గెలిచిన యేడాదికే పార్టీ కండువా మార్చేసిన ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఏ మేర‌కు స‌త్తా చాటారు. వైసీపీలోకి ఎందుకు వెళ్లారు ? నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు ఏమైనా తెచ్చుకున్నారా ? అభివృద్ధి చేస్తాన‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ప్రతి ఇంటికీ కృష్ణావాట‌ర్ అందిస్తాన‌న్న హామీ ఏమైంది ? వంటి అనే ప్రశ్నల‌కు ఇక్కడ ప్రజ‌ల నుంచి పెద‌వి విరుపులే క‌నిపిస్తున్నాయి. ఆయ‌న ఏమీ చేయ‌లేదు. అని నిర్మొహ‌మాటంగా చెప్పేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ నుంచి పోటీ చేసిన వారిలో ఇద్దరూ కొత్తవారే కావ‌డం గ‌మ‌నార్హం. అయినా.. టీడీపీకి ఇక్కడి ప్రజ‌లు ప‌ట్టం క‌ట్టారు.

ఎందుకు పార్టీ మారారని?

ముఖ్యంగా మ‌ద్దాలి గిరిధ‌ర్ పార్టీ మారిపోవ‌డాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. “ఆయ‌న ఎందుకు పార్టీ మారారో.. ఇప్పటికీ మాకు తెలియ‌దు. మాకు చెప్పిన వాటిల్లో ఏ ఒక్క ప‌నికూడా చేయ‌లేదు. చూద్దాం ఇంకా మూడేళ్ల స‌మ‌యం ఉంది కదా!“ అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న గ్రాఫ్ ఎక్కడిది అక్కడే అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక‌, వైసీపీలోనూ గ‌తంలో ఉన్న గుర్తింపు.. ఇప్పుడు లేదు. ఇటీవ‌ల త‌న సొంత ప‌నుల మీద సీఎం ను క‌లిసేందుకు ప్రయ‌త్నించారని, కానీ, సార్ ఖాళీగా లేర‌ని స‌మాచారం అందిన‌ట్టు మ‌ద్దాలి అనుచ‌రులు చెబుతున్నారు.

సీనియర్ నేతలు ఉండటంతో…..

పైగా మ‌ద్దాలి గిరిధ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలో ఉద్దండులు అయిన లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ చంద్ర‌గిరి ఏసుర‌త్నం వాళ్ల హ‌వా బ‌లంగా ఉంది. దీంతో వీరి మ‌ధ్యలో గిరి న‌లిగిపోతున్నారు. ఈ ప‌రిణామాల‌తో మ‌ద్దాలి ఒకింత ఆవేద‌న చెందుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ఇచ్చిన హామీల్లో కొన్నింటినైనా ప‌రిష్కరిస్తేనే ఆయ‌న‌కు ఫ్యూచ‌ర్ ఉంద‌ని.. లేక‌పోతే ఆయ‌నకు మ‌ళ్లీ అసెంబ్లీ ఛాన్స్ క‌ష్టమే అంటున్నారు గుంటూరు జ‌నాలు..!

Tags:    

Similar News