లాక్ డౌన్ ఎవరికి లాభం?

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ మాత్రం తొలిగిపోలేదు. ఒకవైపు లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ప్రధాన పార్టీలు రానున్న ఎన్నికల్లో సీట్లు దక్కించుకోవడంపైనే [more]

Update: 2020-04-09 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ మాత్రం తొలిగిపోలేదు. ఒకవైపు లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ప్రధాన పార్టీలు రానున్న ఎన్నికల్లో సీట్లు దక్కించుకోవడంపైనే కన్నేశాయి. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎక్కువగా ఫోన్ లలోనే తమకు ఓటు వేయాలని కొందరు అభ్యర్థులు కోరుతున్నారు. మరికొందరు అభ్యర్థులు వాట్సాప్ ల ద్వారా రానున్న ఎన్నికల్లో తమను గెలిపించమని వేడుకుంటున్నారు. కరోనాతో ఏపీ మొత్తం లాక్ డౌన్ అయినా ప్రచారం మాత్రం ఏదో రకంగా సాగుతూనే ఉందన్నది వాస్తవం.

నిత్యావసరాల ధరలు పెరుగుదలతో…..

ఈ ప్రచారాన్ని కూడా అభ్యర్థులు తాము కాకుండా తమ అనుచరుల చేత సాగిస్తున్నారు. అయితే లాక్ డౌన్ తర్వాత ఏ పార్టీకి లాభంగా ఉంటుందన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నప్పటికి వాటి ధరలపై ప్రజలపై మండిపడుతున్నారు. కూరగాయల నుంచి బియ్యం, ఉప్పు, పప్పుల ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచారు. ధరల పెరుగుదల ప్రభావం అధికార పార్టీపై పడుతుందంటున్నారు.

ఆ ప్రభావం ఉంటుందన్నది….

ప్రభుత్వం కూడా నియంత్రించలేకపోతోంది. దీనిపై టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసినా వ్యాపారస్థులు మాత్రం ధరలు పెంచుతూనే ఉండటంతో వినియోగదారులు విధిలేని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇది అధికార పార్టీకి కొంత ఇబ్బందిగా మారే అవకాశముంటుం దంటున్నారు. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందన్నది ప్రతిపక్ష పార్టీల అంచనా.

అధికార పార్టీ మాత్రం…..

కానీ అధికార పార్టీ వైసీపీ నేతలు మాత్రం తాము లాక్ డౌన్ విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్లనే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని, రాష‌్ట్రంలో కరోనాను కట్టడి చేయగలిగామని చెబుతున్నారు. ఇది తమకు వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా మారనుందని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపైనే విపక్షం ఆశలు పెట్టుకోగా, కరోనాను అరికట్టగలిగితే ఆ ఇమేజ్ తమకు ఉపయోగ పడుతుందని అధికార పార్టీ భావిస్తుంది. మొత్తం మీద లాక్ డౌన్ తర్వాత రాజకీయంగా పరిస్థితి ఎవరికి అనుకూలంగా మారనుందన్న చర్చ జోరుగా జరుగుతోంది.

Tags:    

Similar News