దీదీ కావాలనే చేసుకుంటున్నారా?
ఎన్నికల సమయంలో కొందరికి తలవంచాలి. మరికొందరి ఎదుట తలఎగరేయాలి. సమయస్ఫూర్తితో ముందుకు సాగాలి. అప్పుడే ఎన్నికల ఫలితాలు అనుకూలంగా మారతాయి. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ [more]
ఎన్నికల సమయంలో కొందరికి తలవంచాలి. మరికొందరి ఎదుట తలఎగరేయాలి. సమయస్ఫూర్తితో ముందుకు సాగాలి. అప్పుడే ఎన్నికల ఫలితాలు అనుకూలంగా మారతాయి. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ [more]
ఎన్నికల సమయంలో కొందరికి తలవంచాలి. మరికొందరి ఎదుట తలఎగరేయాలి. సమయస్ఫూర్తితో ముందుకు సాగాలి. అప్పుడే ఎన్నికల ఫలితాలు అనుకూలంగా మారతాయి. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ మాత్రం ఎవరినీ లెక్క చేయడం లేదు. తాను పదేళ్ల పాటు అధికారంలో ఉన్నానన్న విషయాన్ని మమత బెనర్జీ మర్చిపోతున్నారు. అందుకే అందివచ్చిన అవకాశాన్ని కూడా లెక్క చేయకుండా మమత బెనర్జీ ముందుకు వెళుతున్నారు.
బీజేపీ దూకుడుతో…..
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ మమత బెనర్జీని టార్గెట్ చేసింది. వరస పెట్టి తన పార్టీలో టీఎంసీ నేతలను చేర్చుకుంటుంది. మరోవైపు గవర్నర్ కూడా మమత బెనర్జీ కి సవాల్ గా మారారు. ఈ పరిస్థితుల్లో మమత బెనర్జీ సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ మమత బెనర్జీ మాత్రం తాను ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించగలనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఒవైసీ ప్రతిపాదనకు…..
బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అసదుద్దీన్ ఒవైసీ పశ్చిమ బెంగాల్ లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ రాష్ట్ర ముస్లిం నేతలు ఒవైసీని వచ్చి కలిశారు. అయితే బీహార్ లో జరిగినట్లు బీజేపీకి తమ వల్ల ప్రయోజనం చేకూరకూడదని భావించిన ఒవైసీీ మమత బెనర్జీతో పొత్తు పెట్టుకుని బెంగాల్ లో పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే మమత బెనర్జీ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. బీజేపీకి ఒవైసీ బి టీంగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ వద్ద డబ్బులు తీసుకుని అభ్యర్థులను ఒవైసీ బరిలోకి దించుతున్నారని మమత బెనర్జీ ఆరోపించారు.
ముస్లిం ఓటు బ్యాంకు…
దీంతో ఒవైసీ కి చెందిన ఎంఐఎం పశ్చిమ బెంగాల్ లో పోటీకి దిగుతుంది. దీంతో ముస్లిం ఓటు బ్యాంకు చీలి మమత బెనర్జీకి ఇబ్బందికరంగా మారనుంది. పదేళ్ల నుంచి మమత బెనర్జీ వెంటే ఉన్న ముస్లిం ఓటు బ్యాంకుకు గండిపడుతుందని తెలిసినా ఆమె మాత్రం ఒవైసీ ప్రతిపాదనను తిరస్కరించడం చర్చనీయాంశమైంది. ముస్లిం ఓటర్లు దాదాపు 110 స్థానాల్లో ప్రభావం చూపనున్నారు. మమత బెనర్జీ చేజేతులా తన నిర్ణయాలతో విజయానికి తనంతట తాను దూరమవుతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.