రిస్క్ తీసుకున్నారు సరే….ఉండమంటే ఎలా?
దేశం కోసం మూడు వారాలు త్యాగం చేద్దాం. ఈ రోజు నుంచి లాక్ డౌన్. ఎక్కడి వారు అక్కడే ఉండాలి అంటూ దేశ ప్రధాని జారీ చేసిన [more]
దేశం కోసం మూడు వారాలు త్యాగం చేద్దాం. ఈ రోజు నుంచి లాక్ డౌన్. ఎక్కడి వారు అక్కడే ఉండాలి అంటూ దేశ ప్రధాని జారీ చేసిన [more]
దేశం కోసం మూడు వారాలు త్యాగం చేద్దాం. ఈ రోజు నుంచి లాక్ డౌన్. ఎక్కడి వారు అక్కడే ఉండాలి అంటూ దేశ ప్రధాని జారీ చేసిన ఆదేశాలు ఉల్లంఘించి తెలంగాణ లోని హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులు అక్కడి నుంచి స్వస్థలాలకు బయల్దేరి ఎపి సర్కార్ అభ్యంతరంతో క్వారంటైన్ సెంటర్స్ కి తరలించారు. కొందరు టి సర్కార్ భయంతో వెనక్కి వెళ్లి హాస్టల్స్ లో చేరారు. టి పోలీసులు వారికి ఎన్ ఓ సి సర్టిఫికెట్లు జారీ చేయడం అవి పట్టుకుని స్వస్థలాలకు విద్యార్థులు ఉద్యోగులు వందల సంఖ్యలో తిరిగి రావడం రెండు ప్రభుత్వాల నడుమ సంప్రదింపులు చివరికి ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చిన రాద్ధాంతం అంతా తెలిసిందే. అయితే ఎపి లోకి హెల్త్ ప్రోటోకాల్ పాటిస్తామని చెప్పిన వారిని అనుమతించాక కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.
క్వారంటైన్ వారికి నచ్చలేదు …
ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వారికి 14 రోజులు ప్రభుత్వ నిర్బంధంలోనే ఉండాలన్న హెల్త్ ప్రోటోకాల్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాజమండ్రి లోని బొమ్మూరు సెంటర్ కి తెలంగాణ నుంచి వచ్చిన 200 ల మందిని తరలించారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారిని ఉంచారు. తమ సొంత ఊరికి సొంత ఇంటికి పోవాలని ఎంతో రిస్క్ తీసుకువచ్చిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయని ఆందోళన మొదలు పెట్టారు. తమకు సౌకర్యాలు ఇక్కడ సరిగ్గా లేవంటూ వారు గొడవలు మొదలు పెట్టారు. ముఖ్యంగా మహిళలు తమకు వాష్ రూమ్స్ సరిగ్గా లేవని రెండువారాలకు సరిపడా బట్టలు లేవంటూ ఇంటికి పోయేందుకు వత్తిడి తెస్తున్నారు.
ముందు నుయ్యి వెనుక గొయ్యి …
వీరంతా సొంత ఇళ్ళకు చేరితే కుటుంబ సభ్యులకు రిస్క్ ఏర్పడుతుందన్న ఆలోచనతో ఉన్న ప్రభుత్వం, అధికారయంత్రాంగం ససేమిరా అంటుంది. దాంతో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామని త్రిశంకు స్వర్గంలో ఉన్నవారు గగ్గోలు పెడుతున్నారు. వీరి బాధలు చూశాక భాగ్యనగర్ లో ఉంటూ సొంత గూటికి వెళ్లేందుకు రిస్క్ చేయాలన్న ఆలోచనలో ఉన్నవారు ఎక్కడికక్కడే ఉండటం బెటర్ అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. జిల్లాకు చెందిన వారందరిని ఒకే చోట ఉంచే కన్నా వారి మండల కేంద్రాల్లో క్వారంటైన్ సెంటర్స్ పెట్టి అక్కడికి తరలిస్తే సొంత ఇంటి నుంచి భోజన ఏర్పాట్లు చేసే అవకాశం లభిస్తుందని లేదా ఇంటికే పంపి ఆ ఇంటికి స్టిక్కర్ అంటించడం మంచిదని కొందరు సూచిస్తున్నారు.