ఆ దెబ్బ మామూలుగా ఉండదటగా?
అంతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు. దశాబ్దకాలాలు ప్రత్యర్థులుగా ఉన్న వారు కలసినా కుదురుగా ఉండలేరు. ఈ విషయం ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి [more]
అంతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు. దశాబ్దకాలాలు ప్రత్యర్థులుగా ఉన్న వారు కలసినా కుదురుగా ఉండలేరు. ఈ విషయం ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి [more]
అంతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు. దశాబ్దకాలాలు ప్రత్యర్థులుగా ఉన్న వారు కలసినా కుదురుగా ఉండలేరు. ఈ విషయం ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి రుజువైంది. ఉత్తర్ ప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ బద్ధ శత్రువులు. ఒకరి పై ఒకరు ఎప్పుడు కత్తులు నూరుకుంటారు. అలాంటిది 2019 లోక్ సభ ఎన్నికల్లో ఒక్కటయ్యారు. ఇది ఉత్తర్ ప్రదేశ్ లో అరుదైన సంఘటన. ఇద్దరూ ఒక్కటైనా సాధించిందేమీ లేదు.
రెండు పార్టీలు….
ఉత్తర్ ప్రదేశ్ లో దళిత ఓటు బ్యాంకుతో మాయావతి, బీసీ ఓటు బ్యాంకుతో ములాయం సింగ్ యాదవ్ పగ్గాలు చేపడుతూ వస్తున్నారు. ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతూ వస్తున్నారు. అయితే బీజేపీ క్రమంగా బలపడుతూ గత ఎన్నికల్లో స్వీప్ చేసేసింది. మాయావతి, అఖిలేష్ యాదవ్ లు అధికారం లేక విలవిలలాడిపోయారు. దీంతో 2019లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. మాయావతి, ములయాయం సింగ్ యాదవ్ లు ఒకే వేదికపై కన్పించి అరుదైన సన్నివేశాన్ని రెండు పార్టీల క్యాడర్ కు అందజేశారు.
కేసులు వెనక్కు తీసుకుని….
గతంలో తాము సమాజ్ వాదీ నేతలపై పెట్టిన కేసులను కూడా మాయావతి వెనక్కు తీసుకున్నారు. కానీ ఆ తర్వాత మాయావతికి అర్థమయింది. సమాజ్ వాదీతో కలసి పనిచేస్తే అసలుకే ఎసరువస్తుందని గుర్తించింది. తమ ఓటు బ్యాంకు కూడా చీలిపోయిందని గుర్తించిన మాయావతి లోక్ సభ ఎన్నికల తర్వాత ఎస్పీతో ఫ్రెండ్ షిప్ కు గుడ్ బై చెప్పేశారు. రానున్న ఎన్నికలకు మాయావతి క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. తమ పార్టీ అభ్యర్థి రామ్జీ గౌతమ్ కు వ్యతిరేకంగా సమాజ్ వాదీ పార్టీ పావులు కదిపింది.
ఎస్పీని ఓడించడమే….
మాయావతి పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను రాజ్యసభ ఎన్నికల సందర్భంగా చేర్చుకుంది. వారిపై మాయావతి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాదు సమాజ్ వాదీ పార్టీకి మాయావతి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎస్పీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ముందున్న కర్తవ్యమని మాయావతి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవసరమైతే బీజేపీకి ఓటు వేస్తాం కాని, ఎస్పీని ఓడించి తీరుతాం అని మాయావతి చేసిన ప్రకటన రాజకీయంగా సంచలనమయింది. మరో రెండేళ్లలోజరగనున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మాయావతి వ్యూహం ఎలా ఉండబోతుందా? అన్న చర్చ జరుగుతోంది.