కేరళలో బీజేపీ వ్యూహం మార్చిందా? ఆయనే అయితే?

కేరళ ఎన్నికల వేళ అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్దినెలల్లో జరగుతుండటంతో అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు [more]

Update: 2021-03-02 17:30 GMT

కేరళ ఎన్నికల వేళ అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్దినెలల్లో జరగుతుండటంతో అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీకి మరోసారి అవకాశం ఈ రాష్ట్రం ఇవ్వదు. ప్రస్తుతం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలోకి ఉంది. మరోసారి విజయం సాధించేందుకు విజయన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు బలంగా…

మరో వైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా కేరళ బలంగా ఉంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు మంచిరోజులు ముందున్నాయని చెప్పదలచుకుంది. అయితే ఇక్కడ బీజేపీకి ఏమాత్రం అవకాశాలు లేవు. హిందూ ఓటు బ్యాంకుతో అరకొర సీట్లు గెలుచుకోవడం తప్ప ఇప్పటి వరకూ బీజేపీ కేరళలో పెద్దగా ప్రతిభ కనపర్చిందీ లేదు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనుంది.

మెట్రో మ్యాన్ ను…..

అత్యధికంగా అక్షరాస్యులున్న కేరళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ప్రకటించాలని భావిస్తుంది. దేశ వ్యాప్తంగా మెట్రో శ్రీధరన్ అంటే ప్రసిద్ధి. అనేక రాష్ట్రాల్లో ఆయన మెట్రో సేవలను అందించడంలో కృషి చేశారు. ఇప్పటికీ తమ రాష్ట్రాల్లో మెట్రో సేవలను అందించేందుకు శ్రీధరన్ సలహాలు,సూచనలు తీసుకుంటారు. అలాంటి శ్రీధరన్ అయితే గట్టి పోటీ ఇస్తామని కమలనాధులు భావిస్తున్నారు.

ఆయనే అయితే….?

ఇందుకు శ్రీధరన్ కూడా ఓకే చెప్పారు. భారతీయ జనతా పార్టీ కోరితే తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని శ్రీధరన్ చెబుతున్నారు. ఆయన త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తానని శ్రీధరన్ చెబుతున్నారు. మోదీని విమర్శించడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ గా మారిందన్నారు. తాను మోదీని దగ్గర నుంచి చూశానని, ఆయన నిబద్దత గల నేత అని కొనియాడరు. మొత్తం మీద బీజేపీ అధిష్టానం శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం పార్టీకి కొంత అనుకూలత ఏర్పడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు దశాబ్దాల ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పాలనకు శ్రీధరన్ చెక్ పెడతారో లేదో చూడాలి మరి.

Tags:    

Similar News