పిల్లర్లే లేవు.. పరుగులు తీసేది ఎలా.. మెట్రో కాదుగా?
కేరళ ఎన్నికల్లో బీజేపీకి ఏమాత్రం అవకాశాలు లేవు. ఇక్కడ పోటీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ల మధ్యనే ఉంటుంది. సర్వేలన్నీ పినరయి విజయన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరోసారి [more]
కేరళ ఎన్నికల్లో బీజేపీకి ఏమాత్రం అవకాశాలు లేవు. ఇక్కడ పోటీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ల మధ్యనే ఉంటుంది. సర్వేలన్నీ పినరయి విజయన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరోసారి [more]
కేరళ ఎన్నికల్లో బీజేపీకి ఏమాత్రం అవకాశాలు లేవు. ఇక్కడ పోటీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ల మధ్యనే ఉంటుంది. సర్వేలన్నీ పినరయి విజయన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరోసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నాయి. ఈ తరుణంలో మంచి పేరున్న, వివాదరహితుడిగా ముద్ర ఉన్న శ్రీధరన్ ను బీజేపీికి తెరపైకి తెచ్చింది. శ్రీధరన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటంచింది.
మంచి పేరున్నా….
మెట్రో మ్యాన్ గా శ్రీధరన్ కు మంచి పేరుంది. జాతీయ స్థాయిలో ఆయన సాధించిన ప్రగతిని కేరళవాసులు నేటికీ గుర్తు చేసుకుంటారు. కానీ అదే సమయంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని గెలిపించేంత కాదన్నది వాస్తవం. ఏమీ లేని చోట ఎంతో కొంత పట్టు సాధించాలంటే ఎవరినో ఒకరిని ముందు పెట్టాలి. ఎన్నికలు జరుగుతున్న మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించని బీజేపీ ఇక్కడ మాత్రం శ్రీధరన్ ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.
ఈ వయసులో….
శ్రీధరన్ కు గొప్ప పేరున్నా 88 ఏళ్ల వయసులో ఆయన పార్టీని విజయపథాన నడిపిస్తారనుకోవడం భ్రమ మాత్రమే. కేరళలో ఇప్పటికే ఓటర్లు ఫిక్స్ అయ్యారంటున్నారు. మరోసారి పినరయి విజయన్ కు అవకాశం ఇస్తే మంచిదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎల్డీఎఫ్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి యూడీఎఫ్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయినా వర్గ విభేదాలు ఆ పార్టీని ఈ ఎన్నికల్లో నిలువునా ముంచుతాయంటున్నారు.
పెద్దాయన పరువు నిలబడుతుందా?
ఇక శ్రీధరన్ నేతృత్వంలో బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఇక్కడ జయాపజయాలన్నింటినీ పెద్దాయన శ్రీధరన్ పై బీజేపీ వేసింది. కనీసం పది స్థానాలు సాధించుకుంటే చాలునన్నది బీజేపీ నేతల అంతర్గతంగా జరుపుతున్న చర్చల్లో విన్పిస్తున్న మా. అదే సమయంలో బీజేపీ కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లను భారీగా చీలుస్తుందంటున్నారు. కానీ అది ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కు అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీ పెద్దాయనను బరిలోకి దించి బలం ఉన్నట్లు భ్రమింపచేస్తుంది. పాపం ఈ వయసులో శ్రీదరన్ ఈ రాజకీయ విన్యాసానికి ఎందుకు దిగారో తెలియకుండా ఉంది.