మోడీ తెలుగు చూపు… ?
ఊరకే రారు మహానుభావులు అంటారు. అలాగే రాజకీయ నాయకుల ఆలోచనలు కూడా ఊరికే ఉండవు. వారు ఎవరితో ఎలా ఉంటారో ఆ వైఖరిని బట్టే ఫ్యూచర్ పాలిటిక్స్ [more]
ఊరకే రారు మహానుభావులు అంటారు. అలాగే రాజకీయ నాయకుల ఆలోచనలు కూడా ఊరికే ఉండవు. వారు ఎవరితో ఎలా ఉంటారో ఆ వైఖరిని బట్టే ఫ్యూచర్ పాలిటిక్స్ [more]
ఊరకే రారు మహానుభావులు అంటారు. అలాగే రాజకీయ నాయకుల ఆలోచనలు కూడా ఊరికే ఉండవు. వారు ఎవరితో ఎలా ఉంటారో ఆ వైఖరిని బట్టే ఫ్యూచర్ పాలిటిక్స్ ని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సౌత్ లో బీజేపీకి చోటు లేదని తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు గేటు వేసేశాయి. అయినా సరే బీజేపీకి సౌత్ మీద కొత్త ఆశలు చాలానే ఉన్నాయి. అవి రాజకీయ రాయబేరాలకు అనుకూలమైనవి. తాను ఉంటేనేంటి, తనవారు ఉంటేనేంటి అన్న నిబ్బరం కూడా వాటిలో కనిపిస్తుంది.
ఒక్కరే శత్రువు …?
ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని చూసుకుంటే కనుక అటు కేసీయార్ కైనా, ఇటు జగన్ కైనా ప్రధాన శత్రువు కాంగ్రెస్ అన్న సంగతి తెలిసిందే. కేసీయార్ కి అయితే ప్రధాన ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ ఉండి సవాల్ చేస్తోంది. అందువల్ల కాంగ్రెస్ కి ఆయన ఎపుడూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కేంద్రంలో మద్దతు ఇవ్వలేరు అన్నది తెలిసిందే. ఇక ఏపీలో జగన్ కి చంద్రబాబు ప్రత్యర్ధి అయినా జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ రాకూడదు అనే కోరుకుంటారు. కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటే ఏపీలో తన ఓటు బ్యాంక్ చెల్లాచెదురు అవుతుంది అన్నదే జగన్ భయం అని అంటారు.
అదే ధీమా…?
ఈ రకమైన రాజకీయ సమీకరణలు సహజంగా బీజేపీకే లాభంగా ఉంటాయి అన్నది నిజం. కేంద్రంలో బీజేపీ ఉన్నా తప్పు లేదు కానీ కాంగ్రెస్ వస్తే కొంప కొల్లేరే అన్నది ఇద్దరు తెలుగు వల్లభుల ఆలోచన అని చెబుతారు. ఈ రకమైన అంచనాలు ఉండబట్టే మోడీ కూడా తెలుగు రాష్ట్రాల అధినేతల పట్ల కాస్తా సానుకూలంగా ఉంటారు అంటారు. కేసీయార్ సైతం బయటకు బీజేపీని విమర్శిస్తున్నా కేంద్రంతో మాత్రం ఆచీ తూచీ అన్నట్లుగానే ఉంటారు. జగన్ ఎటూ మోడీకి సపోర్ట్ చేస్తారు అన్నది తెలిసిందే. దీంతో మోడీకి తెలుగు రాష్ట్రాల విషయంలో రాజకీయ ధీమా బాగానే ఉందని అంటారు.
కనెక్ట్ అయ్యారా …?
కరోనా వేళ వివిధ రాష్ట్రాల సీఎంలతో మోడీ మాట్లాడుతున్నారు. ఆ మీదట వారు మోడీ సర్కార్ మీద విమర్శలు కూడా చేస్తున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల సీఎంలు మాత్రం మోడీతో బాగా కనెక్ట్ అవుతున్నారు. మోడీ జగన్ తో మాట్లాడినా కేసీయార్ తో చర్చించినా అయన పట్ల ఈ ఇద్దరూ తన సానుకూలతను కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఏపీకి కేంద్రం సాయం బాగా చేస్తోంది కాబట్టే జగన్ వెనకేసుకువస్తున్నారు అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనడం ఈ సందర్భంగా గమనార్హం. ఇక కేసీయార్ కూడా ప్రధాని తాను చెప్పిన అన్ని విషయాలను సావధానంగా విన్నారు అని చెప్పుకున్నారు. మొత్తానికి 2024 లో కాంగ్రెస్ కూటమి ఒక వైపు మోడీ మరో వైపు ఉంటే తటస్థంగా అయినా కేసీయార్ ఉంటారు కానీ కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వరు అని చెబుతారు. ఇక జగన్ అయితే కాంగ్రెస్ ఊసే తలవరు. కాబట్టి మోడీకి ఈ టైమ్ లో తెలుగు చూపు తెలివితో కూడిన చూపుగానే అంటున్నారు.