ఏనుగు కోసం కార్టూనిస్ట్ లు?
కేరళ లో అత్యంత అమానవీయంగా జరిగిన ఏనుగు మృతి సంఘటన పై సోషల్ మీడియా లో కార్టూనిస్ట్ ల ఉద్యమం సాగిస్తున్నారు. హృదయం ద్రవించే ఈ సంఘటనపై [more]
కేరళ లో అత్యంత అమానవీయంగా జరిగిన ఏనుగు మృతి సంఘటన పై సోషల్ మీడియా లో కార్టూనిస్ట్ ల ఉద్యమం సాగిస్తున్నారు. హృదయం ద్రవించే ఈ సంఘటనపై [more]
కేరళ లో అత్యంత అమానవీయంగా జరిగిన ఏనుగు మృతి సంఘటన పై సోషల్ మీడియా లో కార్టూనిస్ట్ ల ఉద్యమం సాగిస్తున్నారు. హృదయం ద్రవించే ఈ సంఘటనపై కార్టూనిస్ట్ లు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఏనుగు దాని కడుపులో పెరుగుతున్న పిల్ల ఏనుగుల బొమ్మలతో పోస్ట్ అవుతున్న చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ప్రకృతి, పర్యావరణం, మూగజీవాల పట్ల మానవుడి దాష్టికం పై గతంలో జరిగిన అనేక సంఘటనలను ముడిపెడుతూ ఈ ఉద్యమం కొనసాగడం విశేషం. మానవుల్లో పెరుగుతున్న పైశాచికత్వం ఎలాంటి ప్రమాదాలను కొని తెస్తుందో వీరు సజీవంగా కళ్ళకు కట్టినట్లు బొమ్మల రూపంలో చిత్రించి ప్రజల్లో చైతన్యానికి తమవంతు పోరాటం సాగించడం విశేషం. ఈ చిత్రాలకు షేర్స్ లైక్ లు కామెంట్స్ మోతెక్కిపోతున్నాయి.
మారుతున్న ఉద్యమ శైలి …
లాక్ డౌన్ ప్రభావం తో ఇప్పుడు ఉద్యమాల శైలి కూడా భిన్నంగా మారుతుంది. సామాజిక వేదికలపైనే ఇప్పుడు తమ గళాన్ని కలాన్ని జుళిపిస్తున్నారు అంతా. వీటినే వార్తలుగా ప్రధాన మీడియా ప్రచురించుకునే పరిస్థితి ఇప్పుడు 90 శాతం వచ్చేసింది. ఒక అటవీ అధికారి చేసిన పోస్ట్ పైనే దేశం కాదు ప్రపంచం అంతా ఖండించేలా ప్రజలు ఉద్యమించారు. అందుకే ప్రభుత్వాలు సైతం ఇలాంటి అంశాలపై విచారణలు కేసులు సైతం తక్షణం పెట్టి ప్రజలను శాంతిప చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
మూగజీవాలకు….
ముఖ్యంగా మూగ జీవాలకు ఏమాత్రం చిన్న హాని జరిగినా జంతు ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు సామాజిక వేదికలపై నిప్పులు చెరుగుతున్నారు. వీరికి లక్షలు కోట్ల సంఖ్యలో ప్రజలు మద్దతుగా నిలుస్తూ ఉండటంతో రాబోయే కాలంలో ఉద్యమాల స్వభావం తీరు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని కేరళ ఏనుగు ఉదాంతం రుజువు చేస్తుంది.