శివసేనకు ఈసారి కష్టమేనా?

శివసేనకు బృహన్ ముంబయి కార్పొరేషన్ ఎన్నికలు సవాల్ గా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని శివసేన ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో [more]

Update: 2021-01-30 18:29 GMT

శివసేనకు బృహన్ ముంబయి కార్పొరేషన్ ఎన్నికలు సవాల్ గా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని శివసేన ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకోవడంతో శివసేన ఈ ఎన్నికల్లో ఎలా పెర్ ఫార్మెన్స్ చేస్తుందో నన్న ఉత్కంఠ ఆ పార్టీలోనే ఉంది. ఇందుకు కారణం హిందుత్వ నినాదానికి ఈసారి శివసేన దూరంగా ఉండాల్సి వస్తుంది. ముంబయి కేంద్రంగా ఏర్పడిన పార్టీ కావడంతో ఈ ఎన్నికలు శివసేనకు ప్రతిష్టాత్మకం.

రెండేళ్లలో….

2022 లో ముంబయి కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ముంబయి కార్పొరేషన్ పరిధిలో 227 వార్డులున్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో శివసేన 97 స్థానాల్లో విజయం సాధించింది. తర్వాత బీజేపీ 83 స్థానాల్లో గెలుచుకుంది. ఈసారి శివసేన బీజేపీతో కలసి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది. కాంగ్రెస్ ను పక్కన పెట్టి కేవలం ఎన్సీపీతో మాత్రమే కలసి పోటీ చేయాలని శివసేన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఎన్సీపీతోనే కలసి…..

ఎక్కువ పార్టీలను కలుపుకుంటే తక్కువ స్థానాల్లో పోటీ చేయాల్సి వస్తుందని, తద్వారా ముంబయి నగరంపై తాము పట్టుకోల్పోతామని శివసేన భావిస్తుంది. అందుకే తక్కువ స్థానాలను ఎన్సీపీకి ఇచ్చి తాము 150 స్థానాలకు పైగా పోటీ చేయాలన్నది శివసేన ఉద్దేశ్యంగా ఉంది. దీనిపై ఇంకా చర్చలు ప్రారంభం కాకపోయినా కాంగ్రెస్ ను పక్కన పెట్టడం ఎన్సీపీకి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ ఎన్నికల ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న సంకీర్ణ కూటమిపై పడకూడదని ఎన్సీపీ భావిస్తుంది.

లోకల్ నినాదంతో….

అందుకే శివసేన దూకుడు మీద ఉంది. మరాఠా లు ముంబయి నగరంలో ఎక్కువగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. హిందుత్వ నినాదం కంటే ఇప్పుడు లోకల్ నినాదాన్ని శివసేన ప్రధానంగా తీసుకోనుంది. తద్వారా బీజేపీని కట్టడి చేయవచ్చన్నది శివసేన ఆలోచనగా ఉంది. ముంబయి అత్యధిక ఆదాయం కలిగిన నగరం కావడంతో దీనిపై పట్టు సాధించేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే దీనిపై కసరత్తులు ప్రారంభించాయి.

Tags:    

Similar News