బాలయ్యను చూసి నేర్చుకోండర్రా
నందమూరి బాలకృష్ణ వెండి తెర మీద హీరోగా మెరుపులు మెరిపిస్తారు. ఇక రియల్ లైఫ్ చూస్తే తెర వెనక చాలా సైలెంట్ గా ఉంటారు. ఆయన చేసేది [more]
నందమూరి బాలకృష్ణ వెండి తెర మీద హీరోగా మెరుపులు మెరిపిస్తారు. ఇక రియల్ లైఫ్ చూస్తే తెర వెనక చాలా సైలెంట్ గా ఉంటారు. ఆయన చేసేది [more]
నందమూరి బాలకృష్ణ వెండి తెర మీద హీరోగా మెరుపులు మెరిపిస్తారు. ఇక రియల్ లైఫ్ చూస్తే తెర వెనక చాలా సైలెంట్ గా ఉంటారు. ఆయన చేసేది కూడా గట్టిగా ప్రచారం చేసుకోరు. కరోనా వేళ బాలయ్య బాగానే వితరణ చేస్తున్నారు. ఆయన ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలకు చెరి యాభై లక్షల రూపాయలను విరాళంగా అప్పట్లో ఇచ్చారు. మరో పాతిక లక్షలు చిరంజీవి ఆద్వర్యాన ఏర్పాటు అయిన సంస్థకు ఇచ్చి సినీ కార్మికులకు అండగా నిలిచారు. ఇది చాలదన్నట్లుగా తన సొంత ఖర్చుతో సినీ కార్మికులకు కరోనా మందులను కూడా నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ వీవీ వినాయక్ ద్వారా పంపిణీ చేయించారు. తాను చైర్మన్ గా ఉన్న బసవతారకం ఆసుపత్రి సిబ్బందికి కూడా బాలయ్య కరోనా మందులను సరఫరా చేసి తన గొప్పతనాన్ని చాటుకున్నారు.
ఎమ్మెల్యేగా అలా….
ఇక నందమూరి బాలకృష్ణ సినీ నటుడే కాదు, హిందూపురం ఎమ్మెల్యే కూడా. దాంతో ఆయన తన సొంత నియోజకవర్గం ప్రజలకు ఆదుకునేందుకు 55 లక్షల రూపాయల విలువ చేసే కరోనా మందులను ఏకంగా కోవిడ్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అంతే కాదు, అక్కడ ఉన్న వైద్యులకు కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్ ని కూడా పంపించారు. ఓ విధంగా నందమూరి బాలకృష్ణ భారీగా వితరణ చేశారని చెప్పాలి. ఇప్పటిదాకా కొద్ది మంది ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ సొంత ఖర్చుతో కరోనా వేళ ప్రజలను ఇలా ఆదుకున్నది లేదు.
చేతలే మిన్న …..
నందమూరి బాలకృష్ణ చేతలే మిన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాను చేసినది చెప్పుకోకుండా ఆయన సహాయం ఆర్తులకు అందాలన్న ఉద్దేశ్యంతోనే ఇదంతా చేస్తున్నారు అని సన్నిహితులు అంటున్నారు. నిజానికి బాలయ్యను టీడీపీ ఎమ్మెల్యేలు స్పూర్తిగా తీసుకుంటే బాగుంటుంది అన్న మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించరు. అలాగని తన పనిని విస్మరించరు. ఆయన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా విరాళంగా ఏపీ సర్కార్ కి ఇచ్చింది కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే, బాలయ్య నాడు యాభై లక్షలు ఇవ్వడమే కాదు, ఇపుడు మరో 55 లక్షల మందులు ఇవ్వడం ద్వారా కోటి రూపాయల మేర పెద్ద సాయం చేశారు.
ప్రజలు కోరేది …..
ఏ నాయకుడు అయినా కష్టకాలంలో ఆదుకోవాలనే ప్రజలు కోరుతారు. రాజకీయ విమర్శలు వారి కడుపులు నింపవు. మీరు చేయలేదు అని ఒక్క మాట అనవచ్చు. కానీ దానివల్ల బాధితులకు దక్కేదేంటి. ఉన్నంతలో సాయం చేస్తే అది గుర్తుంటుంది. నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో ఢక్కామెక్కీలు తినకపోయినా, మంత్రిగా కూడా పనిచేయకపోయినా తన వంతుగా ముందుకు వచ్చి చేస్తున్నారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు కూడా తలో చేయి వేస్తే కష్టాలతో నష్టాలతో ఉన్న ఏపీ ప్రభుత్వానికి కొంతైనా భారం తగ్గించినట్లు అవుతుంది. అసలు చంద్రబాబు సీనియర్ నేతగా ఈ తరహా రాజకీయాలను అలవాటు చేయాల్సింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆయనే నోరు ఆపుకోలేరు, విమర్శలు చేయకపోతే నోరు ఊరుకోదు, దాంతో తమ్ముళ్లకూ అదే అలవాటు అయింది. దాన్నే ప్రజా సేవ అనుకుంటున్నారు. మొత్తానికి బాలయ్య టీడీపీకే కొత్త దారి చూపించారు. మరి కొందరైనా ఆయన బాటన నడిస్తే ఏపీ జనాలకే అంతిమంగా మేలు జరుగుతుంది.