బాలయ్యకు ఒక బిస్కట్ ?
అదేంటో టీడీపీలో నందమూరి బాలకృష్ణను, ఆయనకు దక్కే గౌరవం చూస్తే జానపద కధల్లో పెద్ద మహారాజు, ఆయన కుటిల బావమరిది, అమాయకపు కొడుకులు గుర్తుకువస్తారు. అసలు టీడీపీ [more]
అదేంటో టీడీపీలో నందమూరి బాలకృష్ణను, ఆయనకు దక్కే గౌరవం చూస్తే జానపద కధల్లో పెద్ద మహారాజు, ఆయన కుటిల బావమరిది, అమాయకపు కొడుకులు గుర్తుకువస్తారు. అసలు టీడీపీ [more]
అదేంటో టీడీపీలో నందమూరి బాలకృష్ణను, ఆయనకు దక్కే గౌరవం చూస్తే జానపద కధల్లో పెద్ద మహారాజు, ఆయన కుటిల బావమరిది, అమాయకపు కొడుకులు గుర్తుకువస్తారు. అసలు టీడీపీ అన్న పార్టీ ఎవరిది. గుత్తమొత్తంగా ఆ పార్టీ వారసత్వం హక్కులు ఎవరివి. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులువు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లొకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా బాలయ్యకు మాత్రం అది అర్ధం కావడంలేదని అంటున్నారు. ఆయన అన్న హరిక్రిష్ణే నయం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. నందమూరి బాలకృష్ణఇప్పటిదాకా వట్టి ఎమ్మెల్యే మాత్రమే. ఇపుడు ఆయనని పార్టీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు.
అందరిలో ఒకరుగా….
నందమూరి బాలకృష్ణ ఘనమైన వారసత్వానికీ, ఆయన హీరో స్టాటస్ కి ఆ పదవి చాలా చిన్నది. కానీ చంద్రబాబు గత ఏడేళ్ళుగా ఆయన పట్ల కనబరుస్తున్న నిరాదరణను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఇది ఎంతో కొంత సంతృప్తి పరచే పదవే. ఇక ఆయన అన్న కూతురు నందమూరి సుహాసినిని తెలంగాణా టీడీపీ వైఎస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నియమించారు. ఇలాటి పదవుల వల్ల నందమూరి వంశానికి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. నిజానికి చంద్రబాబు పాతిక మంది దాకా పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అందులో నందమూరి బాలకృష్ణ ఒకరు అని సరిపెట్టుకోవాలి.
అవసరమేనా..?
నందమూరి బాలకృష్ణ ఎంత కాదనుకున్నా పార్టీకి నాలుగు ఓట్లు తెచ్చిపెట్టగలరు. ఆయన వల్ల చంద్రబాబుకే కాదు, లోకేష్ కి కూడా వచ్చిన రాజకీయ నష్టం లేదు. ఆయనకు హీరో ఇమేజ్ ఉంది. పైగా ఆయన అయితే బావ, లేకపోతే అల్లుడు అధికారంలో ఉంటే తనకు చాలు అనుకునే నిస్వార్ధజీవి. నిజానికి ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అయినా ఇవ్వాల్సింది. దాని వల్ల కూడా పార్టీ ఎలివేట్ అవుతుంది. రెండు రాష్ట్రాలో ఆయన పర్యటించి పార్టీకి కొంత మేలు చేసి పెట్టే వీలు ఉండేది. కానీ ఆ పదవిని తన కుమారుడికి కట్టబెట్టారు బాబు. అంతే కాదు లోకేష్ ని తిరిగి పొలిటి బ్యూరోలో, సెంట్రల్ కమిటీలో కూడా నియమించి సర్వం లోకేష్ మయం చేశారు. నందమూరి బాలకృష్ణకి ఇంత పెద్ద కసరత్తులో కేవలం పొలిటి బ్యూరో మెంబర్ అన్న పదవి మాత్రం దక్కింది.
ఆశలు తీరవా….?
ఇక్కడ చిత్రమేంటంటే నందమూరి బాలకృష్ణకు పార్టీ పదవులు కానీ మంత్రి పదవులు కానీ తీసుకోవాలి అన్న పంతమేమీ పెద్దగా ఉన్నట్లు ఎక్కడా కనిపించదు. ఆయన చంద్రబాబుకు అత్యంత వీర విధేయుడు. కానీ నందమూరి అభిమానులకు మాత్రం బాలయ్యని కీలకమైన స్థానాల్లో చూడాలని ఉంది. ఆయన్ని కాబోయే సీఎం అని ఒకప్పుడు అంతా కీర్తించారు. ఇపుడు వారు కూడా కాస్త తగ్గారు. కనీసం మంత్రి కూడా తమ హీరోకు ఇవ్వలేదు అన్న బాధ వారికి ఎపుడూ ఉంది. ఇపుడు పొలిట్ బ్యూరో మెంబర్ అంటున్నారు. దాంతో ఒరిగేది ఏముంది అన్నది కూడా వారి ఆవేదన. ఏది ఏమైనా తాజా కమిటీల రూపకల్పనలో నారా వారిదే పెత్తనం అని మరోమారు రుజువు అయింది. అది ఎంతలా అంటే ఓ వైపు పార్టీ ప్రతిష్ట పాతాళానికి దిగజారినా కూడా నందమూరి బాలకృష్ణకి కేవలం బిస్కట్ మాత్రమే ఇచ్చి మొత్తం పార్టీని తమ గుప్పిట్లో ఉంచుకునేటంత.