అల్లుడికి గిల్లుడే మరి …?
నందమూరి బాలకృష్ణ. ఆయన పేరులోనే పవర్ ఉంది. దానికి కారణం ఆయన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆయన సినీ రాజకీయ రంగాల్లో ఎవరెస్ట్ శిఖరం. ఆయన [more]
నందమూరి బాలకృష్ణ. ఆయన పేరులోనే పవర్ ఉంది. దానికి కారణం ఆయన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆయన సినీ రాజకీయ రంగాల్లో ఎవరెస్ట్ శిఖరం. ఆయన [more]
నందమూరి బాలకృష్ణ. ఆయన పేరులోనే పవర్ ఉంది. దానికి కారణం ఆయన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆయన సినీ రాజకీయ రంగాల్లో ఎవరెస్ట్ శిఖరం. ఆయన సరి సాటి ఎవరూ లేరు కూడా. తెలుగు వారికి అన్న గారుగా ఆరాధ్య దైవంగా ఎన్టీయార్ నిలిచారు. ఆయన పోయి పాతికేళ్ళు అవుతున్నా అసలైన వారసులు లేరు అంటేనే ఆయన ఖ్యాతీ, విఖ్యాతి అర్ధం చేసుకోవాల్సిందే. ఇక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ప్రెసిడెంట్ గా ఉన్నా కూడా ఎన్టీయార్ లేని లోటు అలాగే ఇప్పటికీ ఉంది. రెండేళ్ళ క్రితం పార్టీ ఘోరంగా ఓడిపోయాక టీడీపీ మనుగడ మీద కొత్త సందేహాలు తలెత్తుతున్న వేళ అందరి చూపూ నందమూరి వారసుల మీదనే ఉంది.
క్యాడర్ తో లింక్….?
నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే సినిమాలు వరసపెట్టి చేస్తున్నారు. అలాగని ఆయన రాజకీయాల మీద ఆసక్తి లేరని ఎవరూ అనడంలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం బలాలను, బలహీనతలను కూడా ఎప్పటికపుడు బేరీజు వేసుకుంటున్నారుట. అదే సమయంలో బాలయ్య పార్టీ క్యాడర్ తో కూడా సంబంధాలను గతంలో కంటే ఎక్కువగా మెరుగుపరచుకుంటు న్నారనే చెప్పాలి. రాష్ట్రంలో ఏ టీడీపీ కార్యకర్తకు ఆపద వచ్చినా నందమూరి బాలకృష్ణ ఫోన్ ద్వారా పరామర్శిస్తున్నారుట. వారికి ఆ విధంగా తాను ఉన్నాను అని గట్టి భరోసా ఇస్తున్నారుట.
సరైన సమయంలో…?
ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశాఖకు చెందిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ చెప్పారు. బాలయ్య సరైన సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వస్తాయని ఆయన ప్రకటించడం సంచలనం రేపుతోంది. బాలయ్య ఇక మీదట పార్టీలో క్రియాశీలమైన పాత్రను పోషిస్తారు అని ఆయన చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో ముందు ముందు పాలుపంచుకుంటారని కూడా ఆయన చెబుతున్నారు. బాలయ్య కనుక వస్తే పార్టీకి పూర్వ వైభవం రావడం తధ్యమని కూడా ప్రసాద్ వంటి నాయకులు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ ఎంట్రీ ….?
నందమూరి బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని ఉందని చాలా కాలంగా ప్రచారంలో ఉన్న మాటే. అయితే బాలయ్య ఒక నియమం పెట్టుకున్నారుట. తన బావ చంద్రబాబు నాయకత్వం గట్టిగా ఉంటే తాను రాకూడదని, అయితే టీడీపీలో నారా లోకేష్ ఆధిపత్యం రోజురోజుకీ పెరిగిపోవడంతోనే బాలయ్య ఎంట్రీ తప్పనిసరి అవుతోందని అంటున్నారు. బావ తరువత తానే అన్న సంకేతాన్ని ఇటు క్యాడర్ కి అటు అల్లుడికీ కూడా పంపించడానికే నందమూరి బాలకృష్ణ అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేపడుతున్నారు అని అంటున్నారు. మరో వైపు టీడీపీలో ఎలా చూసుకున్నా చంద్రబాబు తరువాత ఎవరు అన్న ప్రశ్న అయితే ఉంది. లోకేష్ తో పోల్చితే బాలయ్యే బెటర్ అన్న భావన కూడా మెజారిటీ వర్గాల్లో ఉంది. బహుశా ఇవన్నీ గమనించే నందమూరి బాలకృష్ణ దూకుడుగా పాలిటిక్స్ లోకి బిగ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు.