బాలయ్యకు చెక్.. ఇంత సీరియస్ ఇష్యూ ఈ మధ్య లేదంటే నమ్మాలి
టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ.. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన విషయం తెలిసిందే. 2014లో తొలిసారి [more]
టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ.. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన విషయం తెలిసిందే. 2014లో తొలిసారి [more]
టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ.. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించిన విషయం తెలిసిందే. 2014లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన బాలయ్య తమకు కలిసి వచ్చిన హిందూపురం నుంచి పోటీ కి దిగారు. అక్కడ విజయం సాధించారు. అయితే, అనంతర కాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీనికి కారణం. నియోజకవర్గానికి దూరం కావడమే. నియోజకవర్గం ప్రజల సమస్యలు పట్టించుకునీ పట్టించుకోనట్టు వ్యవహరించడం, తాను సినిమా షూటింగులతో బిజీగా ఉండడం, తన బదులుగా వేరేవారిని ఇక్కడ ఇంచార్జ్ గా పెట్టడం.. ఆయన అవినీతికి పాల్పడడం వంటివి అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. నందమూరి బాలకృష్ణను ఇబ్బందుల్లోకి నెట్టాయి.
ఆధార్ కార్డులను కూడా….
ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణపై నియోజకవర్గం ప్రజలు ఆగ్రహం పెంచుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే టీడీపీ అధికారంలో ఉండడంతో వెంటనే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఎన్నికలకు ముందు నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి ఇద్దరూ కూడా తమ ఆధార్ కార్డులను హిందూపురానికి మార్పించుకున్నారు. ఇకపై తాము నియోజకవర్గంలోనే ఉంటామని వారు హామీ ఇచ్చారు. అదే సమయంలో ఎన్నడూ లేంది .. గత ఏడాది ఎన్నికల సమయంలో సతీమణితో కలిసి ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు. ఇలా ఒక అనుభవం నుంచి నేర్చుకున్న పాఠంతో గత ఎన్నికల సమయంలో ఆపసోపాలు పడ్డారు.
చంద్రబాబు ఇన్ వాల్వ్ అయి…
ఈ క్రమంలోనే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు రంగంలోకి దిగి చిలకలూరిపేటకు చెందిన ఓ మాజీ సర్పంచ్‌కు హిందూపురం బాధ్యతలు ఇచ్చారు. ఆయన అక్కడ రంగంలోకి దిగి పార్టీ పరిస్థితిని చక్కదిద్ది పార్టీ కేడర్‌ను సమ్వయం చేసే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి చక్కపడలేదు. దీంతో గెలవడం కష్టం అనుకున్న నందమూరి బాలకృష్ణ జగన్ సునామీలో తన సత్తా చాటుకుని విజయం సాధించారు. మొన్న సునామీలోనూ బాలయ్య హిందూపురంలో 17 వేల మెజార్టీతో గెలవడం అంటే ఆ నియోజకవర్గంలో నందమూరి కుటుంబానికి ఉన్న పట్టు మరోసారి స్పష్టమైంది.
రెండు సార్లు మాత్రమే పర్యటించి…
ఇప్పుడు ఎన్నికలు ముగిసి నందమూరి బాలకృష్ణ రెండో సారి కూడా విజయం సాధించి ఏడాది పూర్తయింది. మరి ఈ ఏడాది కాలంలో బాలయ్య హిందూపురంలో ఎన్నిసార్లు పర్యటించారు? ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అంటే.. కనీసం తమకు కనిపించడం కూడా మానేశారని ఇక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల తర్వాత కేవలం రెండంటే రెండు సార్లు నియోజకవర్గానికి వచ్చారని, అది కూడా ఒకసారి తన సొంత వ్యవహారానికి వచ్చారని వారు ఆరోపిస్తున్నారు. తమను కనీసం పట్టించుకునేందుకు కూడా నందమూరి బాలకృష్ణకు తీరిక లేకుండా పోయిందని అంటున్నారు.
వైసీపీ ఈ సమయాన్ని…..
ఈ క్రమంలోనే ఇటు సినిమాల్లో బిజీ అయిన నందమూరి బాలకృష్ణ వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో మాత్రం హిందూపురంలో నామ్‌కే వాస్తేగా కూరగాయాల పంపిణీ చేపట్టారు. ఈ పరిణామాలను సైలెంట్‌గా గమనిస్తున్న వైసీపీ నేతలు.. తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఇక్బాల్‌తో పాటు మాజీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నవీన్ నిశ్చల్ మధ్య విబేధాలు ఉన్నా పార్టీ అధిష్టానం మాత్రం వారిద్దరిన సమన్వయ పరుస్తూ అక్కడ నందమూరి బాలకృష్ణకు చెక్ పెట్టేందుకు ప్లాన్లు వేస్తోంది.