బాల‌య్య భారమేనట

ఆయ‌న ఎన్టీఆర్ సినీ వార‌సుడు. ఇప్పుడు రాజ‌కీయ వార‌సుడు కూడా. ఆయనే నందమూరి బాలకృష్ణ. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ హిందూపురం అసెంబ్లీ నుంచి విజ‌యం సాధించారు. అయితే, [more]

Update: 2019-09-19 15:30 GMT

ఆయ‌న ఎన్టీఆర్ సినీ వార‌సుడు. ఇప్పుడు రాజ‌కీయ వార‌సుడు కూడా. ఆయనే నందమూరి బాలకృష్ణ. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ హిందూపురం అసెంబ్లీ నుంచి విజ‌యం సాధించారు. అయితే, పేరుకు మాత్ర‌మే ఎమ్మెల్యే అయినా ఆయ‌న ఎప్పు డూ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌రు. ఎప్పుడైనా అకేష‌న‌ల్‌గా మాత్ర‌మే నియోజ‌క‌వర్గంలో ప‌ర్య‌టించి ఫొటోల‌కు ఫోజులిస్తారు. అంతే త‌ప్ప చేసింది కూడా ఏమీలేదు. స‌రే, గ‌తంలో అయితే, సొంత పార్టీ టీడీపీ అధికారంలో ఉంది కాబ‌ట్టి.. అక్క‌డో ఇంచార్జ్‌ను నియ‌మించి మ‌మ అని అనిపించారు. ఎప్పుడైనా వెళ్లిఫొటోల‌కు ఫోజులిచ్చేవారు. అంత‌టితో ఆయ‌న ఉద్యోగ బాధ్య‌త‌లు ముగిసేవి.

సినిమాలపైనే…..

అయితే, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఉన్న‌ది విప‌క్షంలో. వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని పాలిస్తోంది. అయితే, ఇప్పుడు కూడా నందమూరి బాలకృష్ణ అటు నియోజ‌క‌వ‌ర్గాన్ని, ఇటు పార్టీని ఏమాత్ర‌మూ ప‌ట్టించుకోలేదు. అప్పుడెప్పుడో.. అసెం బ్లీ స‌మావేశాల్లో ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేసేందుకు వ‌చ్చిన ఆయ‌న ఆత‌ర్వాత వ‌చ్చింది లేదు. త‌న సినిమా షూటింగుల్లోనే కాలం గ‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం ఆయన సినిమా కాశీ చిత్రం షూటింగ్‌లో ఉంది. దీని నిర్మాణంలోనే తీరిక లేకుండా ఉన్నారు. కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బోయ‌పాటి శ్రీను సినిమా చేయ‌నున్నాడు.

ఇంత జరుగుతున్నా….

అంటే నందమూరి బాలకృష్ణ వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాల‌కు ఓకే చెపుతున్నాడు. ఈ లెక్క‌న మ‌రో యేడాది పాటు ఆయ‌న సినిమాల్లోనే బీజీ కానున్నాడు. ఈ లెక్క‌న త‌న‌ను వ‌రుస‌గా రెండుసార్లు గెలిపించిన హిందూపురం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే ప‌రిస్థితే లేదు. మ‌రోప‌క్క‌, ఆయ‌న తండ్రి స్థాపించిన టీడీపీ ఏపీలో అల్లాడి ఆకులు మేస్తోంది. ప్ర‌భుత్వంపై పోరాటాలు చేయ‌డంలో అలిసి సొలిసి పోతోంది. ఈ నేప‌థ్యంలో పార్టీని కాపాడుకునేందుకు, ఓట‌మి భారంతో కుంగిపోయిన పార్టీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ధైర్యం చెప్పేందుకు ముందుకు వ‌చ్చి త‌న‌దైన శైలితో ప్ర‌జ‌ల‌ను, పార్టీ నాయ‌కుల‌ను ఆక‌ట్టుకోవాల్సిన నందమూరి బాలకృష్ణ మాత్రం సినిమా ఫీల్డ్‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.

సోషల్ మీడియాలో కూడా….

ఇటీవ‌ల ఛ‌లో ఆత్మ‌కూరుకు చంద్ర‌బాబు పిలుపు నిచ్చినా కూడా అతి పెద్ద ఈ కార్య‌క్ర‌మానికి కూడా నందమూరి బాలకృష్ణ డుమ్మా కొట్టారు. అంతేకాదు, పోనీ ఎక్క‌డ ఉన్నా.. ట్విట్ట‌ర్‌లోనో ఏదైనా సోష‌ల్ మీడియాలోనైనా స్పందించి ఉంటే బాగుండేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ, నందమూరి బాలకృష్ణ మాత్రం త‌న పంథాను వీడ‌న‌ని చెబుతున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అటు పార్టీకి కంచుకోట లాంటి అనంత‌పురం జిల్లాలో గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో నందమూరి బాలకృష్ణ ఒక‌రు. ఆ జిల్లాలో కొంద‌రు టీడీపీ నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నా క‌నీసం నందమూరి బాలకృష్ణ వారితో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌డం లేద‌న్న చ‌ర్చ‌లు టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. మ‌రోవైపు వైసీపీ అక్క‌డ బాల‌య్య‌పై ఓడిన ఇక్బాల్ ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి పార్టీని ప‌టిష్టం చేస్తోంది.

Tags:    

Similar News