బాలయ్యా…ఎపుడు వస్తావయ్యా..?

సినిమా కమ్ పొలిటీషియన్లతో ఇదే పెద్ద బాధ. వారు రెండు పడవల మీద కాళ్ళు వేస్తారు. దాంతో ఎటు వెళ్తారో ఎపుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియదు [more]

Update: 2021-02-18 03:30 GMT

సినిమా కమ్ పొలిటీషియన్లతో ఇదే పెద్ద బాధ. వారు రెండు పడవల మీద కాళ్ళు వేస్తారు. దాంతో ఎటు వెళ్తారో ఎపుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక తెలుగుదేశాన్ని పెట్టింది అధికారంలోకి తెచ్చింది ఎన్టీ రామారావు. ఆయన నట వారసుడిగా సక్సెస్ అయిన నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో మాట్రం గెస్ట్ రోల్ గానే ఇప్పటికీ మిగిలిపోయారు. ఆయనకు మనసులో ఏముందో కానీ టీడీపీ లో సింహాసనం మాత్రం ఎప్పటికీ ఖాళీ అవడంలేదు. అది ఖాళీ కానన్నాళ్ళూ బాలయ్య యాక్షన్ కట్ అంటూ సెట్స్ మీద షూటింగులతో గడిపేయాల్సివస్తోంది.

వస్తున్నా మీ కోసం…..

బావ చంద్రబాబు వస్తున్నా మీ కోసం అని పాదయాత్ర చేశారు. ఇపుడు నందమూరి బాలకృష్ణ కూడా కార్యకర్తల కోసం తాను ఉన్నానని వస్తున్నానని భారీ స్టేట్మెంటే ఇచ్చేస్తున్నారు. ఆయన తాజాగా స్థానిక ఎన్నికల నేపధ్యంలో పార్టీ నాయకులతో ఫోన్ ద్వారానే మాట్లాడుతూ తనదైన పాలిటిక్స్ చేస్తున్నారు. బాబు జూమ్ యాప్ లో ఉంటే ఫోన్ ద్వారా బాలయ్య పార్టీ బండిని లాగాలనుకుంటున్నారన్నమాట. స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరాలని కూడా బాలయ్య ఫోన్ ద్వారానే పిలుపు ఇస్తున్నారు. అంతటితో ఆగకుండా తాను త్వరలోనే వస్తున్నాను పార్టీని కాపాడుకుందామంటూ క్యాడర్ కి ధైర్యం నూరిపోస్తున్నారుట.

నిజంగానే అయ్యేనా…?

వరసపెట్టి సినిమాలు చేస్తున్న నందమూరి బాలకృష్ణకు అంత తీరిక‌ ఉందా అని తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు. అందరికీ పార్టీలో పెద్ద పదవులు ఇచ్చిన బాబు బాలయ్యని పొలిట్ బ్యూరో మెంబర్ గా మాత్రం చేసి ఊరుకున్నారు. నాటి నుంచి బావ బావమరిది కలసిన ఫోటో ఎక్కడా కనిపించలేదు అన్న చర్చ కూడా తెలుగు రాజకీయాల్లో ఉంది. పార్టీ పెద్దలకు ఎవరికీ చెప్పకుండానే తన హిందూపురం టూర్ ని ఈ మధ్యనే పెట్టుకున్న బాలయ్య త్వరలోనే జగన్ పాలనకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతాను అంటున్నారు. మరి నందమూరి బాలకృష్ణ కనుక ఏపీలో టూర్లు వేస్తే అది టీడీపీకి ప్లస్ అవుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇంతకీ ఆయన షూటింగులు ఆపుకుని రోడ్ల బాట పడతారా అన్న డౌట్లు కూడా తమ్ముళ్ళకు కలుగుతున్నాయట.

బాబు వీక్ అయిన చోటనే….?

ఇక ఏపీలో టీడీపీ వీక్ గా ఉంది. పెదబాబు, చినబాబు 2019 ఎన్నికల్లో బాగానే హంగామా చేసి 23 సీట్ల దగ్గర చతికిలపడ్డారు. ఇపుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది రెండేళ్ల జగన్ పాలనకు ఒక విధంగా రెఫరెండమే అంటున్నారు. దాంతో పాటు తిరుపతి బై పోల్ కూడా ఉంది. వీటి రిజల్ట్ లో ఏ మాత్రం తేడా కొట్టినా బాబు నాయకత్వం మీద టీడీపీలో కొత్త ఆలోచనలు పుడితే మాత్రం కచ్చితంగా నందమూరి బాలకృష్ణ నేరుగా పార్టీ రూట్లోనే ఏపీలో టూర్లు వేయడానికి వస్తారని అంటున్నారు. మొత్తానికి ఏపీలో జగన్ తో పోరాడే సత్తా తనకే ఉందని నట సింహం గట్టిగానే భావిస్తున్నారుట.

Tags:    

Similar News