మోదీ ఎలా డీల్ చేస్తారో? ఆసక్తిగా చూస్తున్న ప్రపంచం

లాక్ డౌన్ ను ఎలా తొలగిస్తారన్న దానిపై భారత్ వైపు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. ప్రస్తుతం భారత్ లో దాదాపు నాలుగు వందల జిల్లాలకు పైగా [more]

Update: 2020-04-26 16:30 GMT

లాక్ డౌన్ ను ఎలా తొలగిస్తారన్న దానిపై భారత్ వైపు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. ప్రస్తుతం భారత్ లో దాదాపు నాలుగు వందల జిల్లాలకు పైగా కరోనా వైరస్ సోకలేదు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించారు. వీటిలో దాదాపు ఇరవై ఐదు వేల మంది కరోనా వైరస్ బారిన పడినట్లు నిర్థారణ అయింది. మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ విధించారు.

ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత…..

అయితే ఈ నెల 27వ తేదీన నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలను సేకరించారు. లాక్ డౌన్ ను ప్రకటించే నాటికి, ఇప్పటికి 16 శాతం కేసులు పెరగడం ఆందోళన కల్గించే అంశమే. అయితే ఇతర దేశాల్లో లాక్ డౌన్ ను ఎత్తివేసి కేసులు పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ ను విధించారు. దీనికి సింగపూర్ ను ఉదాహరణగా చూపుతున్నారు.

ఇప్పటికే కొన్ని మినహాయింపులు….

ఇప్పటికే భారత్ లో లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత నుంచి కొన్ని రంగాకు లాక్ డౌన్ లో మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత మళ్లీ పుస్తకాల షాపులు, మొబైల్ ఛార్జిల షాపులు, ఎలక్ట్రిక్ ఫ్యాన్ల విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. క్రమంగా లాక్ డౌన్ లో మినహాయింపులు ఇస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తుంది. అయితే కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ ను మళ్లీ పొడిగిస్తారన్న ప్రచారం జరుగుతుంది.

కేసులు పెరిగితే?

ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత మోదీ ఈ నిర్ణయం తీసుకోనున్నారు. మే 3వ తేదీపై మోదీ లాక్ డౌన్ కొనసాగింపుపై ప్రకటన చేసే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోయి ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు పేద, మధ్యతరగతి ప్రజల్లోనూ లాక్ డౌన్ పై అసంతృప్తి పెరుగుతోంది. మరి ఈ సమయంలో మోదీ లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. మరికొన్ని రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తారా? లేక మరికొన్నాళ్లు లాక్ డౌన్ ను పొడిగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. మే చివరినాటికి మరణాల సంఖ్య దాదాపు 38 వేలకు చేరుకుంటుందన్న అంచనాల మధ్య మోదీ డిసిషన్ ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News