ఆ బూచి నిమ్మగడ్డపై బాగా పనిచేసిందా?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలుత దూకుడుగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కొంత వెనక్కు తగ్గినట్లు కన్పిస్తుంది. ఈ వాచ్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలుత దూకుడుగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కొంత వెనక్కు తగ్గినట్లు కన్పిస్తుంది. ఈ వాచ్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలుత దూకుడుగా ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కొంత వెనక్కు తగ్గినట్లు కన్పిస్తుంది. ఈ వాచ్ యాప్ పై న్యాయస్థానంలో ఇబ్బంది ఎదురుకావడంతో పాటు, ప్రివిలైజ్ కమిటీకి మంత్రులు నోటీసులు ఇవ్వడమూ ఒక కారణంగా కన్పిస్తుంది. అందుకే అధికారులకు, ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కితాబులివ్వడం వెనక కథ ఏంటి? అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది.
అన్నింటా దూకూడు…..
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం దగ్గర నుంచి అధికారులపై చర్యల వరకూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేగంగా స్పందించారు. పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లను నిర్భంధ పదవీ విరమణ చేయించాలంటూ డీవోపీటీకి లేఖ రాశారు. వారిని అభిశంసించాలని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిఫార్సు చేశారు. ఆ తర్వాత వెనక్కు తగ్గారు. నిర్బంధ పదవీ విరమణ విషయంలో తన లేఖను ఉప సంహరించుకుంటున్నానని పేర్కొన్నారు.
ఏకగ్రీవాలపైన కూడా….
పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల సందర్భంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపేయాలని తొలుత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఆ తర్వాత మళ్లీ ఆ ఏకగ్రీవాలన్నింటినీ ఆమోదిస్తున్నట్లు తెలిపారు. రెండు, మూడో విడత జరిగిన ఏకగ్రీవాలను కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెంటనే ఆమోదించారు. దీంతో పాటు ఎన్నికలను అధికారులు సజావుగా నిర్వహించారని కితాబు ఇచ్చారు.
ఉన్నట్లుండి వైఖరిలో మార్పు….
అయితే పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనేక ఫిర్యాదులు చేసింది. అనేక చోట్ల నామినేషన్లను తిరస్కరించారని, బలవంతపు ఏకగ్రీవాలను చేయించుకున్నారని టీడీపీ అధికార పార్టీ వైసీపీపై చేసిన ఫిర్యాదులు బుట్టదాఖలే అయ్యాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లో ప్రివిలైజ్ కమిటీలో తన అంశం చర్చకు వచ్చాకే మార్పు వచ్చిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ప్రివిలైజ్ కమిటీ కూడా ఇంతవరకూ ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. అప్పటి నుంచే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వైఖరిని మార్చుకున్నారన్న టాక్ బలంగా విన్పిస్తుంది.