అలా కుమ్మేస్తే ఎలా నాని?
సహజంగా రాజకీయాల్లో ఉన్న వారు బహిరంగ వేదికలపై ఎక్కితే.. అప్పుడప్పుడు సంయమనం కోల్పోవడం మనకు తెలిసిందే. ఇక, వైసీపీ నేతలు ఈ విషయంలో ముందున్న విషయం పెద్దగా [more]
సహజంగా రాజకీయాల్లో ఉన్న వారు బహిరంగ వేదికలపై ఎక్కితే.. అప్పుడప్పుడు సంయమనం కోల్పోవడం మనకు తెలిసిందే. ఇక, వైసీపీ నేతలు ఈ విషయంలో ముందున్న విషయం పెద్దగా [more]
సహజంగా రాజకీయాల్లో ఉన్న వారు బహిరంగ వేదికలపై ఎక్కితే.. అప్పుడప్పుడు సంయమనం కోల్పోవడం మనకు తెలిసిందే. ఇక, వైసీపీ నేతలు ఈ విషయంలో ముందున్న విషయం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నోటికి వచ్చింది మాట్లాడేసి.. తర్వాత సరిదిద్దుకోవడం కొంతమంది చేస్తుంటే.. ఆ ఏమవుతుంది ? అని ఎంత సీరియస్ కామెంట్లనైనా.. లైట్ తీసుకునే కొడాలి నాని వంటి మంత్రులు కూడా మనకు కనిపిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు ఏం మాట్టాడినా.. సెకన్ల వ్యవధిలో వైరల్ అవుతోంది. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తున్నవారు..ఈ విషయంలో మరింత దూకుడుగా ఉన్నారు.
మంత్రి విమర్శలతో….
తాజాగా.. మంత్రి పేర్ని నాని కూడా చంద్రబాబుపై తీవ్ర విమర్శ చేశారు. కేబినెట్ బేటీ అంశాలపై మీడియా మీటింగ్ పెట్టిన పేర్ని నాని ఆయా విషయాలు వివరించేశాక.. విషయానికి వచ్చారు. అమరావతి ఉద్యమానికి 365 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో బహిరంగ సభ నిర్వహించారు. దీనికి చంద్రబాబు కూడా హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ ధోరణిలో.. వైసీపీ ప్రభుత్వానికి సవాల్ రువ్వారు. మీరు మూడు రాజధానుల అజెండాతో ఎన్నికలకు రండి.. మేం ఒక రాజధాని అమరావతి అజెండాతో ముందుకు వస్తాం.. అన్నారు.
వయాగ్రా వేసుకున్నారని….
అంతటితో ఆగకుండా.. మీరు కనుక మూడు రాజధానుల అజెండాతో గెలిస్తే.. నేను రాజకీయాల నుంచి తప్పుకొంటానన్నారు చంద్రబాబు. దీనిపై పేర్ని నాని భారీ కామెంట్ చేశారు. చంద్రబాబు వయాగ్రా వేసుకున్న వాడిలా ఊగిపోయారు.. 90 ఏళ్లు వచ్చినవాడు.. అలిసిపోయాను ఇక, పెళ్లి చేసుకోను.. అన్నట్టుగా బాబు మాట్లాడారు. అని కామెంట్ కుమ్మారు. అనంతరం స్టేజీ దిగిపోతుంటే.. ఓ పాత్రికేయుడు మిత్రుడు వెళ్లి.. సార్ మీరు వయాగ్రా అని కామెంట్ చేశారు. ఇది చాలా తప్పుసార్.. అన్నారట. వెంటనే స్పందించిన మంత్రి.. “అయితే.. తమ్ముడూ.. నేను తప్పు మాట్లాడానంటావా? “ అని ఎదురు ప్రశ్నించారు. ఔను అని సదరు పాత్రికేయుడు అనేసరికి.. ఆ మాత్రం మసాలా ఉండాలి తమ్ముడూ.. అయినా.. మేం అన్నదానికీ మీరు మరింత మసాలా జోడిస్తారుగా.. రాసుకోండి.. అనేసి వడివడిగా వెళ్లిపోయారట. ప్రస్తుతం వయాగ్రా వ్యాఖ్యలను జాతీయ మీడియా కూడా ప్రధానంగా పేర్కొనడం గమనార్హం.