ఈ మంత్రి కూడా టార్గెట్ అయ్యారా..?
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలు గడిచిపోయాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి.. ఇప్పటి జగన్ ప్రభుత్వానికి పైకి తేడా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం కొన్ని [more]
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలు గడిచిపోయాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి.. ఇప్పటి జగన్ ప్రభుత్వానికి పైకి తేడా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం కొన్ని [more]
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలు గడిచిపోయాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి.. ఇప్పటి జగన్ ప్రభుత్వానికి పైకి తేడా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం కొన్ని కీలక సూత్రాలను జగన్ కూడా బాబు మాదిరిగానే ఫాలో అవుతున్నారు. అయితే, అప్పట్లో చీమ చిటుక్కుమన్నా చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి గంటల కొద్దీ ప్రసంగాలను దంచేవారు. కానీ, ఇప్పుడు జగన్ మాత్రం తాను చేయాలని అనుకుంటున్నది చేసేస్తున్నారు తప్ప.. మీడియా సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరుగుతోందో తెలియడానికి కొంత సమయం పడుతోంది.
ఇద్దరు మంత్రులపై…..
తాజాగా సీఎంవో వర్గాల కథనం మేరకు.. సీఎం జగన్ మంత్రులపై నివేదికలు తెప్పించుకుని సమీక్షిస్తున్నారు. వీటి ఆధారంగా ఆయన మంత్రుల పనితీరును బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు మంత్రులపై ఆయన వ్యతిరేక భావన ప్రదర్శించారు. నేరుగా వారికి కూడా చెప్పేశారు. పనితీరు మెరుగు పరుచుకోవాలని ఆయన సూచించారు. వారిలో గిరిజన శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఒకరైతే.. మరో మంత్రి శ్రీరంగనాథరాజు. వీరిద్దరిలోనూ పనితీరు మెరుగు పరుచుకోవాలని పుష్ప శ్రీవాణికి చెబితే.. మీపని మీరు చేసుకోండన్నా.. అని శ్రీరంగనాథరాజుకు జగన్ సుతిమెత్తని మొట్టికాయలు వేశారు.
శాఖను సమన్వయం చేసుకోవడంలో…..
ఇక, ఇప్పుడు మరో కీలక శాఖ విషయంలో జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అదే రెవెన్యూ శాఖ. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు సీఎంవో అధికారులు. రెవెన్యూ శాఖను కీలక నాయకుడు, వైఎస్‌కు అత్యంత ఇష్టమైన నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చూస్తున్నారు. వైఎస్ హయాంలోనూ ఈయన మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎమ్మెల్సీగా ఉన్నందున జగన్ ఈయనకు మంత్రి పదవిని ఇచ్చారు. అయితే, పనితీరులో ఈయన దూకుడు చూపిస్తున్నా.. అధికారులతో పని చేయించడం లోను,తన శాఖను లైన్‌లో పెట్టడంలోనూ విఫలమయ్యారనేది సీఎం భావనగా ఉందని అంటున్నారు.
ఆదాయం తగ్గడంతో….
ప్రభుత్వానికి పన్ను వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం గతంతో పోలిస్తే తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఫీజులు, జీఎస్‌టీ, ఎక్సైజ్ తదితర పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఏడుశాతం తగ్గిందని పేర్కొంది. ఈ ధోరణి నెలకొన్న రాష్ట్రాల్లోనే ఏపీనే ప్రథమస్థానంలో ఉంది. అదే సమయంలో ప్రజల మూలధన వ్యయం గణనీయంగా తగ్గిపోయింది. మూలధన వ్యయం అంటే… భూములు, స్థలాలు, ఇళ్లు, ఇతర స్థిరాస్థులపై వెచ్చించే మొత్తం. ఈ వ్యయం ఎంత ఎక్కువుంటే అంతగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క. ఈ వ్యయంపైనే ఆర్థికచక్రం ఆధారపడి ఉంటుంది. అయితే, ఇవన్నీ చూడాల్సిన రెవెన్యూ శాఖ తన అంచనాలు అందుకోలేక పోతోందనే భావన జగన్‌లో ఉందని అంటున్నారు. ఇప్పటికే ప్రతి సమీక్షలోనూ రెవెన్యూపై దృష్టి పెడుతున్న సీఎం జగన్ తాజాగా కూడా మంత్రి పనితీరు బాగున్నా.. అధికారులపై పట్టులేదనే వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. మరి మున్ముందు ఏమవుతుందో చూడాలి.