బోస్‌కు రాజ్యసభ సీటు వెనుక ఏం జరిగింది? జగన్ వ్యూహమేనా?
వైసీపీలో కీలక నాయకుడు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు వైసీపీ అధినేత, సీఎం జగన్ రాజ్యసభకు నామినేట్ చేశారు. [more]
వైసీపీలో కీలక నాయకుడు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు వైసీపీ అధినేత, సీఎం జగన్ రాజ్యసభకు నామినేట్ చేశారు. [more]
వైసీపీలో కీలక నాయకుడు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు వైసీపీ అధినేత, సీఎం జగన్ రాజ్యసభకు నామినేట్ చేశారు. ప్రస్తుతం వైసీపీకి దక్కిన నాలుగు సీట్లలో ఒకదానిని బోసుకు కేటాయించారు. ఎలాగూ అసెంబ్లీలో వైసీపీకి బలం ఉంది కాబట్టి ఎన్నిక ఏకగ్రీవమే అవుతుంది. అయితే బోస్‌కు ఇలా రాజ్యసభ సీటుకు ఎంపిక చేయడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా ? అనే చర్చ జరుగుతోంది. నిజానికి బీసీ వర్గానికి చెందిన నాయకుడు బోస్. దీంతో ఆయనకు ఇవ్వడం రాజకీయంగా కూడా జగన్ వేసిన ఎత్తుగడే. బీసీల్లో బలమైన శెట్టిబలిజ వర్గానికి చెందిన బోస్ ఆ వర్గాన్ని వైసీపీకి దగ్గర చేయడంలో గత కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. ఇక ఒకేసారి ఇద్దరు బీసీలకు ఇవ్వడం పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.
మండలి రద్దు కావడంతో…..
ప్రస్తుత మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా బీసీనే. ఈయనకు కూడా రాజ్యసభ సీటు ఇచ్చారు. ఈ క్రమంలో బోస్‌కు సీటు ఇవ్వడం అంటే.. దీనివెనుక కీలకమైన వ్యూహం ఉందని చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచికూడా బోస్ వైసీపీలో ఉన్నారు. అదే సమయంలో వైఎస్ కు అత్యంత ప్రియమైన అనుచరుడిగా కూడా గుర్తింపు పొందారు. వైఎస్ కుటుంబానికి కూడా చేరువయ్యారు. ఈ క్రమంలోనే గతంలోనే జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక, ఇప్పుడు కూడా గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా.. ఎమ్మెల్సీగా ఉండటంతో మంత్రిని చేశారు. ఇప్పుడు త్వరలోనే మండలి రద్దు కానుండడంతో బోస్‌ను రాజ్యసభకు పంపించారని అంటున్నారు.
తోట కారణమా?
అయితే, బోస్‌ను రాజ్యసభకు పంపడం వెనుక మరో వ్యూహం కూడా ఉందని చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రపురం. గత ఎన్నికల్లో ఆయనకు ఇక్కడ నుంచి టికెట్ ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు బోస్‌ను మండపేటకు పంపారు. అయితే బోస్ ఇక్కడ టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బోస్ మంత్రి అయ్యాక జిల్లాపై పట్టు సాధించడంతో పాటు తిరిగి రామచంద్రాపురంలో తన కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా ఇక్కడ నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
బోస్ ను తప్పించడం వెనక?
భావించారు. అయితే, ఇటీవల ఇక్కడ టీడీపీ నాయకుడు, బోస్ చిరకాల రాజకీయ ప్రత్యర్థి తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. వైసీపీలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేది ఉదయభానుకు స్వయానా వియ్యంకుడు కూడా అవడంతో త్రిమూర్తులు రామచంద్రపురంపై పట్టు పెంచుకునేందుకు ఇప్పటి వరకు తనకు అడ్డుగా ఉన్న బోస్‌ను తప్పించారని అంటున్నారు. ఈ క్రమంలోనే బోస్‌కు రాజ్యసభ సీటుఇవ్వడం ద్వారా పార్టీలో ఆయనకు తగిన గౌరవం ఇచ్చినట్టు అయ్యింది. అదే సమయంలో రామచంద్రపురంలో తనకుసొంత పార్టీలో కీలక ప్రత్యర్థి లేకుండా చేసినట్లు అవుతుందని తోట అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వగా… ఇక్కడ బోస్‌కు రాజ్యసభ దక్కడంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఉన్నారు. మరి ఈయనతో తోటకు ఎలా పొసుగుతుందో ? చూడాలి.