పెద్దల సభకు వెళ్లాక పిల్లికి ఏమైంది?

పిల్లి సుభాష్ చంద్రబోస్. నీతి మంతమైన నేత. జగన్ కు అత్యంత నమ్మకమైన లీడర్. అందుకే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా ఎంపిక చేసి జగన్ మంత్రిని [more]

Update: 2020-11-30 06:30 GMT

పిల్లి సుభాష్ చంద్రబోస్. నీతి మంతమైన నేత. జగన్ కు అత్యంత నమ్మకమైన లీడర్. అందుకే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా ఎంపిక చేసి జగన్ మంత్రిని చేశారు. తర్వాత శాసనమండలి రద్దు అని నిర్ణయించిన తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ ను జగన్ రాజ్యసభకు పంపారు. అయితే మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి వివాదాలకు తావివ్వని పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇటీవల పెద్దల సభకు వెళ్లిన తర్వాత కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారారు.

జగన్ ప్రయారిటీ ఇచ్చినా….

పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్ నేత. వైసీపీలో ఆయన తొలి నుంచి ఉన్న నేత. అందుకే ఆయనంటే జగన్ కు అంత గౌరవం. గత ఎన్నికల్లోనూ ఆయన మండపేట టిక్కెట్ ఇచ్చి జగన్ గెలిపించాలనుకున్నారు. కానీ ఓటమి పాలు కావడంతో ఆయనను మంత్రిని చేసి పిల్లి కి తన ప్రయారిటీ ఇది అని చెప్పకనే చెప్పారు. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యవహార శైలి బాగా మారిపోయిందంటున్నారు.

తోట త్రిమూర్తుల విషయంలోనూ….

కొంతకాలం క్రితం పిల్లి సుభాష్ చంద్రబోస్ తోట త్రిమూర్తులపై హోంమంత్రికి లేఖ రాశారు. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు ప్రభుత్వ న్యాయవాదులను మేనేజ్ చేస్తున్నారని తెలిపారు. నిజానికి తోట త్రిమూర్తులు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ పెద్దమనిషిగా వ్యవహరించినట్లయితే ఆ లేఖను బహిర్గతం చేయరు. నేరుగా పార్టీ హైకమాండ్ కే ఫిర్యాదు చేసి ఉండేవారు. కానీ తూర్పు గోదావరి జిల్లాలో పార్టీలో రచ్చ లేపడానికే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ లేఖ రాశారని అర్ధమవుతుంది.

ఎమ్మెల్యేలతోనూ…

తాజాగా కాకినాడ డీఆర్సీ మీటింగ్ లోనూ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కలకలం రేపాయి. టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించడమే కాకుండా, మేడ లైన్ ప్రాంతంలో అక్రమ కట్టడాల వల్లనే కాకినాడ మునిగిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహానికి కారణమయింది. పిల్లి సుభాష‌ చంద్రబోస్ పెద్దమనిషిగా వీటన్నింటిని పార్టీ కార్యాలయంలోనే లేవనెత్తాల్సి ఉండగా వీధికెక్కడం చర్చనీయాంశమైంది. పిల్లికి ఏమైంది అన్న చర్చ వైసీపీలో జరుగుతుంది.

Tags:    

Similar News