ఇప్పట్లో “లాక్” తీసే సమస్యే లేదట

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం దేశంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందనే చెప్పాలి. లెక్కలే దీనిని స్పష్టం చేస్తున్నాయి. సరైన సమయంలో లాక్ డౌన్ నిర్ణయం [more]

Update: 2020-04-23 16:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం దేశంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందనే చెప్పాలి. లెక్కలే దీనిని స్పష్టం చేస్తున్నాయి. సరైన సమయంలో లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడంతో కమ్యూనిటీ దశకు భారత్ చేరుకోలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లాక్ డౌన్ వల్లనే ఇది సాధ్యమయిందంటున్నారు. లాక్ డౌన్ కారణంగా భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉన్నాయన్నది ప్రపంచ దేశాలు సయితం అంగీకరిస్తున్న విషయం.

రెండోసారి లాక్ డౌన్ ను….

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి లాక్ డౌన్ ను పొడిగించడానికి కూడా కారణాలున్నాయంటున్నారు. చైన్ పూర్తిగా కట్ అయ్యేంత వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తారని చెబుతున్నారు. మే 3వ తేదీ తర్వాత కూడా కొన్నింటికి మినహాయింపులు ఇచ్చినా, లాక్ డౌన్ ను కంటిన్యూ చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. జీరో కేసులు కాకపోయినా కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ కు వచ్చేంత వరకూ లాక్ డౌన్ ను కొసాగించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు.

లాక్ డౌన్ వల్లనే….

అయితే లాక్ డౌన్ వల్ల లాభంలేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శలకు బీజేపీ నేతలు ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు. మోదీ సకాలంలో లాక్ డౌన్ ప్రకటించకుంటే ఇటలీలా మారి ఉండేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో టెస్ట్ ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మరోవైపు భారత్ లో కరోనా కేసులు రెట్టింపు కావడానికి నాలుగు రోజులు పడితే, ఇతర దేశాల్లో కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే కేసులు రెట్టింపు అయ్యాయని గుర్తు చేస్తున్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే…..

130 కోట్ల మంది ఉన్న జనాభాలో అందరికీ టెస్ట్ లు నిర్వహించాలంటే సాధ్యం కాదు. సెన్సెస్ తీయాలన్నా నెలల తరబడి పడుతుంది. అలాంటిది టెస్ట్ లు నిర్వహించాలంటే కష్టమే. అందుకే లాక్ డౌన్ నిర్వహించి ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ, అనుమానితులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్ లలో లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందన్నది అందరూ అంగీకరిస్తున్న విషయమే. అయితే లాక్ డౌన్ అనంతరం పరిస్థితులు ఏమిటన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. భారత్ ఇప్పట్లో ఆర్థికంగా కోలుకోగలదా? నిలదొక్కుకోగలదా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News