ఈయన భవిష్యత్  కూడా మరో ఏడెనిమిది నెలలే?

ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీ తీరును చూసిన తరవాత గతంలో వివిధ రాష్రాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు గుర్తుకు రాక మానదు. అసమ్మతి వ్యవహారాలు, ముఖ్యమంత్రుల [more]

Update: 2021-07-11 16:30 GMT

ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీ తీరును చూసిన తరవాత గతంలో వివిధ రాష్రాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు గుర్తుకు రాక మానదు. అసమ్మతి వ్యవహారాలు, ముఖ్యమంత్రుల మార్పులు, ఢిల్లీ చుట్టూ సీఎంల ప్రదక్షిణలు, కొన్ని సందర్భాల్లో అధిష్టానమే పరోక్షంగా అసమ్మతిని తెరవెనక నుంచి ప్రోత్సహించడం వంటివి అప్పట్లో సర్వ సాధారణం. దిగిపోయే సీఎం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రతిపాదించడం, మాజీ ముఖ్యమంత్రికి కేంద్రంలో రాజకీయ పునరావాసం కల్పించడం వంటివి చోటుచేసుకునేవి. మొన్నటికి మొన్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్ ను కాదని గతంలో కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన హిమంత బిశ్వ శర్మను కమలం పార్టీ కొత్త సీఎంను చేసింది. సోనావాల్ ను ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇటు వంటి రాజకీయాలు తాత్కాలికంగా బాగున్నప్పటికీ భవిష్యత్తు ఎన్నికల్లో బీజేపీ విజాయవకాశాలను దెబ్బతీస్తాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు పంజాబ్ లోనూ హస్తం పార్టీ దాదాపు అలాంటి రాజకీయాలనే చేస్తోంది.

మూడో ముఖ్యమంత్రిగా…..

ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఉత్తరాఖండ్ విషయంలో అలానే చేసింది. తాజాగా రాష్ర్ట ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీని నియమించింది. దీంతో 2017 మార్చిలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ నియమించిన మూడో ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ గుర్తింపు పొందారు. దేశంలో అతి పెద్ద రాష్ర్టమైన యూపీని విభజించి 2000 సంవత్సరంలో కేంద్రంలోని అప్పటి వాజపేయి సర్కారు ఉత్తరాంచల్ రాష్ర్టం ఏర్పాటు చేసింది. తరవాత దానిని ఉత్తరాఖండ్ గా మార్చారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు భాజపా 57సీట్లతో ఘన విజయం సాధించింది. త్రివేంద్ర సింగ్ రావత్ ను డెహ్రూడూన్ అధికార పీఠంపై ఆశీనులయ్యారు. పార్టీలో నెలకొన్న తీవ్రమైన అసమ్మతి కారణంగా రావత్ ఈ ఏడాది మార్చిలో రాజీనామా చేశారు.

తప్పని పరిస్థితుల్లో ….

మార్చి 10న కొత్త ముఖ్యమంత్రిగా తీరధ్ సింగ్ రావత్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎమ్మల్యే కాదు. ఘర్వాల్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. సెప్టెంబరులోపు ఎమ్మేల్యేగా ఆయన ఎన్నికవ్వాల్సి ఉంది. కరోనా కారణంగా ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విముఖత చూపడంతో రావత్ అనివార్యంగా రాజీ
నామా చేయాల్సి వచ్చింది. రావత్ పనితీరుపై పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఆయన తన వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టారు. అంతర్గత విభేదాలను చక్కదిద్ద లేకపోయారు. కరోనా సమయంలో కుంభమేళా నిర్వహణపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇవన్నీ రావత్ అధికార పీఠానికి ఎసరు పెట్టాయి. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ను పార్టీ నియమించింది. సింగ్ ముందు చాలా సవాళ్లే ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో…

మరో ఏడెనిదిమినెలల్లో అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఏకతాటిపై నడిపించాల్సి ఉంది. వర్గ విభేదాలతో సతమతమవుతున్న బీజేపీని ఎన్నికలకు సిద్ధం చేయడం అంత తేలికైన విషయం కాదు. లక్నో యూనివర్సిటీ నుంచి లా చేసిన పుష్కర్ సింగ్ ఖటిమా నియోజకవర్గం నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2002-06 మధ్య రాష్ర్ట బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేసిన పుష్కర్ సింగ్ ఒక్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత మహారాష్ర్ట గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంపైనే పుష్కర్ సింగ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News