Raghu veera : ఆ ఛాన్సే లేదంటున్నారే?
మాజీ మంత్రి రఘువీరారెడ్డి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత రెండేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వ్యాపారాలను, రాజకీయాలను పూర్తిగా వదిలేశారు. [more]
మాజీ మంత్రి రఘువీరారెడ్డి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత రెండేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వ్యాపారాలను, రాజకీయాలను పూర్తిగా వదిలేశారు. [more]
మాజీ మంత్రి రఘువీరారెడ్డి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత రెండేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వ్యాపారాలను, రాజకీయాలను పూర్తిగా వదిలేశారు. తన సొంత గ్రామమైన నీలకంఠాపురంానికే పరిమితమయ్యారు. గ్రామ అభివృద్ధితో పాటు వ్యవసాయ పనులను ఆయన చూసుకుంటూ సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు. రాజకీయాలకంటే ఈ జీవితాన్నే రఘువీరారెడ్డి ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
సెకండ్ ఇన్సింగ్స్ ను….
అయితే పాలిటిక్స్ లో రఘువీరారెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేస్తారని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు హైకమాండ్ రఘువీరారెడ్డిని ఢిల్లీకి పిలవడమే ఇందుకు కారణం. ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ కు అనుంగు శిష్యుడిగా ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ లోనే కొనసాగారు. విభజన తర్వాత ఏర్పడిన రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పనిచేశారు.
ప్రచారం ఎక్కువగా…
రెండుసార్లు ఓటమి పాలవ్వడంతో రఘువీరారెడ్డి పీసీసీ చీఫ్ గా రాజీనామా చేసి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఆయన ఆథ్మాత్మిక చింతనకు అలవాటుపడ్డారు. తన సొంతగ్రామమైన నీలకంఠాపురంలో అందరి దేవుళ్లతో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంపై టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి వంటి వారు కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు. కొన్నాళ్ల క్రితం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇదే బాగుందట….
అయితే రఘువీరారెడ్డి రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పినట్లేనట. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో తాను ఇమడలేనని సన్నిహితులతో ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తనకు ఈ జీవితమే బాగుందని, తన వ్యాపారాలను కూడా పూర్తిగా వారసులకే వదిలేసి తాను గ్రామీణ జీవితానికి అలవాటుపడ్డానని, మరోసారి ఆ రొచ్చులోకి దిగబోనని కూడా రఘువీరారెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో రఘువీరారెడ్డిపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లే.