రాజుగారు రెచ్చిపోతున్నా… ఇక అంతేనా?

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వైసీపీ అధినేత ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆయన వ్యవహారం రోజురోజుకూ శృతి మించుతోంది. మొన్నటి వరకూ జగన్ [more]

Update: 2021-05-25 09:30 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై వైసీపీ అధినేత ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆయన వ్యవహారం రోజురోజుకూ శృతి మించుతోంది. మొన్నటి వరకూ జగన్ ను పక్కన పెట్టి పార్టీ లో కీలక నేతలను విమర్శించే రఘురామ కృష్ణంరాజు నేరుగా జగన్ పైనే విమర్శలు చేస్తున్నారు. రోజు రచ్చ బండ పేరుతో ఊగిపోతున్నారు. అయినా ఆయనకు ఎవరూ కౌంటర్ ఇచ్చేందుకుకూడా సిద్ధపడటం లేదు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ వారం రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారింది.

చికాకు తెప్పిస్తూ…..

నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణంరాజు వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. విపక్షాల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తూ రఘురామ కృష్ణంరాజు వైసీపీ నేతలకు చికాకు తెప్పిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారిపైనే ఆయన విమర్శలు చేసేవారు. జగన్ పై పెద్దగా విమర్శలు చేసేవారు కాదు. కాని ఇప్పుడు నేరుగా జగన్ ను టార్గెట్ చేశారు.

జగన్ పై నేరుగా….

జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటీషన్ సీబీఐ కోర్టు స్వీకరించడంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారు. అయితే రఘురామ కృష్ణంరాజు పై చర్యలు తీసుకోవాలని జగన్ పై వత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ పట్టించుకోలేదు. ఇక ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాల్సింది ఒక్కటే మిగిలి ఉంది. అయితే ఎవరూ ఊహించని విదంగా ఆయన ను అరెస్ట్ చేశారు. రాజద్రోహం కేసులు పెట్టి దాదాపు వారం రోజులు లోపలేయగలిగారు.

మరోసారి స్పీకర్ ను కలసి…..

పార్టీ నుంచి బహిష‌్కరిస్తే అది రఘురామ కృష్ణంరాజుకు మేలు చేకూర్చినట్లవుతుంది. ఆయన ఇక స్వతంత్రంగా మరో మూడేళ్లు ఎంపీగా కొనసాగుతారు. అందుకే బహిష్కరణ వేటు కాకుండా అనర్హత వేటు వేయడంపైనే వైసీపీ అధినేత దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా సీబీఐ కోర్టులో రఘురామ కృష్ణంరాజు పిటీషన్ వేయడాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. పార్టీలో మాత్రం రఘురామ కృష్ణంరాజు పై ఏదో ఒక చర్య త్వరగా తీసుకోవాలన్న వత్తిడి పెరుగుతోంది. ఇక సుప్రీంకోర్టు కూడా మీడియాతో మాట్లాడవద్దంటూ షరతులు విధించడం జగన్ ప్రభుత్వానికి ఊరటేనని చెప్పాలి.

Tags:    

Similar News