పదేళ్ల తర్వాతైనా ఫలితం దొరుకుతుందా?

రాష్ట్ర కాంగ్రెస్ ను ఎలాగైనా గాడిలో పెట్టాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అన్ని రాష్ట్రాలలోనూ వరసగా పార్టీని ప్రక్షాళన చేస్తూ వస్తున్న రాహుల్ గాంధీ ఏపీ [more]

Update: 2021-08-18 11:00 GMT

రాష్ట్ర కాంగ్రెస్ ను ఎలాగైనా గాడిలో పెట్టాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అన్ని రాష్ట్రాలలోనూ వరసగా పార్టీని ప్రక్షాళన చేస్తూ వస్తున్న రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ ను కూడా పూర్తిస్థాయిలో మార్చాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. సామాజికవర్గాలు, సమీకరణాలు అంటూ కూర్చుంటే అసలుకే ఎసరు వస్తుందని భావించిన ఆయన పార్టీకి నూతన అధ్యక్షుడి నియామకంపై కూడా దృష్టి సారించినట్లు తెలిసింది.

ఏమాత్రం పుంజుకోని….?

ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా సాకే శైలజానాధ్ వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. పైగా శైలజానాధ్ రాష్ట్ర స్థాయి నేత కాదు. సామాజికవర్గ పరంగా కూడా ఆయన పార్టీకి ఉపయోగపడింది లేదు. భవిష్యత్ లో పడబోరు కూడా. దీంతో శైలజానాధ్ ను తప్పించి కొత్త వారికి పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు పలుపేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది.

ఆ సామాజికవర్గం అయితేనే…?

కాపు, రెడ్డి సామాజిక వర్గాల నుంచి నేతను పీసీసీ చీఫ్ గా ఎంపిక చేసే అవకాశాలున్నాయి. జగన్ వైసీపీ పార్టీని పెట్టిన తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు క్యాడర్ ను కూడా పట్టుకెళ్లారు. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన నేతలను పీసీసీ చీఫ్ గా నియమిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందా? అన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత అయితేనే జగన్ ను బలంగా ఎదుర్కొనగలరని, కాంగ్రెస్ తిరిగి కొంత పుంజుకునే అవకాశాలున్నాయని భావిస్తుంది.

ఎన్నికల సమయానికి…?

ఇందుకోసం అనేక పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నారని సమాచారం. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకు కూడా ఒక అవకాశమివ్వాలన్న యోచనలోఉంది. అయితే ఇప్పటికే బీజేపీ, జనసేన అధ్యక్షులు అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో రెడ్డి సామాజికవర్గం నేతనే నియమించాలన్నది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావన. కొంతలో కొంత ఎన్నికల సమయానికి పుంజుకున్నా, తమతో పొత్తు పెట్టుకునేందుకు పార్టీలు ముందుకు వస్తాయన్న అంచనాలో ఉంది. రాష్ట్ర విభజన అంశం పదేళ్ల తర్వాత తెరమరుగు అవుతుందన్న ఆశతో కాంగ్రెస్ ఉంది. మొత్తం మీద త్వరలోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ప్రక్షాళన అయ్యే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News