Kuppam : కుప్పం వైసీపీ అసలు హీరో ఈయనేనట
చంద్రబాబును సొంత నియోజకవర్గమైన కుప్పంలో దెబ్బతీయడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ప్రధాన పాత్ర పోషించారనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే [more]
చంద్రబాబును సొంత నియోజకవర్గమైన కుప్పంలో దెబ్బతీయడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ప్రధాన పాత్ర పోషించారనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే [more]
చంద్రబాబును సొంత నియోజకవర్గమైన కుప్పంలో దెబ్బతీయడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ప్రధాన పాత్ర పోషించారనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కుప్పం బాధ్యతను జగన్ ఎంపీ రెడ్డప్పకు అప్పగించారు. అక్కడ వైసీపీ తరుపున పోటీ చేసిన చంద్రమౌళి మరణించడం, వారి కుమారుడు యువకుడు కావడంతో దగ్గరుండి నడిపించాలని రెడ్డప్పకు కుప్పం టాస్క్ ఇచ్చారు.
ఆయనకూ అవసరమే….
నిజానికి కుప్పం నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయడం కూడా రెడ్డప్పకు అవసరమే. ఎందుకంటే చిత్తూరు పార్లమెంటు నుంచి టీడీపీ ఎప్పుడు గెలిచినా కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ వల్లనే. శివప్రసాద్ వరసగా రెండు సార్లు విజయం సాధించింది కుప్పం వల్లనే. అందుకే రెడ్డప్ప కూడా కుప్పం పై ఫోకస్ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం, సూచనలతో ఆయన కుప్పంలో పార్టీని బలోపేతం చేయగలిగారు.
బలమైన నేతలను…
తొలుత కుప్పంలో టీడీపీకి బలమైన నేతలను వైసీపీ వైపు మళ్లించగలగడంలో రెడ్డప్ప సక్సెస్ అయ్యారు. కుప్పం మండలంతో పాటు జడ్పీటీసీని కూడా వైసీపీ గెలుచుకోవడంలో రెడ్డప్ప సక్సెస్ అయ్యారు. వివాదాలకు, రొటీన్ రాజకీయాలకు రెడ్డప్ప దూరంగా ఉంటారు. తనకు పార్టీ అప్పగించిన బాధ్యతలను ఆయన తూచ తప్పకుండా అమలు చేస్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా నమ్మకమైన నేతగా కొనసాగుతున్నారు.
కీలక నేతగా….
ఇప్పుడు కుప్పంలో వైసీపీ గెలవడానికి పెద్దిరెడ్డి కి వచ్చిన పాపులారిటీ రెడ్డప్పకు రాలేదు. అయినా వెనకుండి నడిపించింది అంతా ఆయనేనని కుప్పం వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు వైసీపీలో రెడ్డప్ప హీరో అయ్యారంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కుప్పం నియోజకవర్గ బాధ్యతను కూడా ఆయనకే అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు. వైసీపీ ఎంపీ రెడ్డప్ప కుప్పంలో కీలక నేతగా మారారనడంలో సందేహం లేదు.