తెలంగాణలో కొత్త పార్టీ… రేవంత్ రెడీ అయ్యారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇక ఛాన్స్ లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ మట్టి కొట్టుకుపోయిందనే చెప్పాలి. గాంధీ భవన్ కు ఎప్పుడో బూజు పట్టింది. అయితే ఇదే సమయంలో [more]

Update: 2020-12-06 06:30 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇక ఛాన్స్ లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ మట్టి కొట్టుకుపోయిందనే చెప్పాలి. గాంధీ భవన్ కు ఎప్పుడో బూజు పట్టింది. అయితే ఇదే సమయంలో పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. వరస ఓటములతో కుచించుకు పోతున్న కాంగ్రెస్ లో నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను వెదుక్కోవడమూ కష్టమే. మరో వైపు బీజేపీ దూసుకు వస్తుంది. ఈ నేపథ్యంలో మరో ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉన్నట్లు గుర్తించి ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది.

ఆరేళ్ల నుంచి…..

ఇప్పటికే తెలంగాణలో బలమైన సామాజికవర్గం గత ఆరేళ్ల నుంచి పట్టు కోల్పోయినట్లు కన్పిస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత రెడ్డి సామాజికవర్గం రాజకీయంగా, వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదన్నది కొందరి ఆవేదన. కొత్త రాష్ట్రం వచ్చాక రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారి వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వారికి ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నారు.

పీసీసీ చీఫ్ ఇస్తారనుకున్నా….

రేవంత్ రెడ్డి వాస్తవానికి పీసీసీ చీఫ్ ఇస్తారనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యం కాదు. అనేక మంది నేతలు రేవంత్ రెడ్డి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పడు పీసీసీ చీఫ్ ను మార్చినా కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా మరో వైపునకు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ కు పటిష్టమైన ఓటు బ్యాంకు తెలంగాణలో ఉంది. అయితే దానిపై నమ్మకం లేక బీజేపీ వైపు టర్న్ కాకముందే రేవంత్ రెడ్డి చేత ప్రాంతీయ పార్టీ పెట్టించాలని కొందరు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్పేస్ ఉంటుందని…..

కొత్త పార్టీకి ఇప్పుడు తెలంగాణలో అవకాశముందని రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్ కనుమరుగు కావడం, బీజేపీ కూడా తెలంగాణకు పెద్దగా న్యాయం చేయకపోవడంతో ప్రాంతీయ పార్టీకి ఇక్కడ మనుగడ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డిపై కొందరు ప్రెషర్ తెస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కొంతమంది కూడా రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీకి సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి సయితం అందుకే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ లో ఉండి భవిష్యత్ కోసం వెతుక్కోవడం కంటే తానే అవకాశాన్ని సృష్టించుకోవడం మేలన్న అభిప్రాయానికి రేవంత్ రెడ్డి వచ్చినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News