సబ్బం హరి మాటలకు విలువ లేదా?
మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మాటలకు విలువ లేకుండా పోయింది. ఆయన రాజకీయంగా జరుపుతున్న విశ్లేషణలు సయితం ఒకవైపే ఉండటంతో వైసీపీ సోషల్ మీడియాలో సబ్బం [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మాటలకు విలువ లేకుండా పోయింది. ఆయన రాజకీయంగా జరుపుతున్న విశ్లేషణలు సయితం ఒకవైపే ఉండటంతో వైసీపీ సోషల్ మీడియాలో సబ్బం [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మాటలకు విలువ లేకుండా పోయింది. ఆయన రాజకీయంగా జరుపుతున్న విశ్లేషణలు సయితం ఒకవైపే ఉండటంతో వైసీపీ సోషల్ మీడియాలో సబ్బం హరి నిత్యం ట్రోల్ అవుతూ ఉంటారు. సబ్బంహరి కొన్ని ఛానళ్లలో చేసే వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంటాయి. జగన్ కేసుల కోసమే ఢిల్లీ వెళుతున్నారని తనకు ఖచ్చితమైన సమాచారం ఉందని సబ్బం హరి చెప్పినప్పుడు కూడా ఇదే రకమైన విమర్శలు వచ్చాయి.
గతంలో మంచి పేరున్నా….
నిజానికి సబ్బం హరికి రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది. కాంగ్రెస్ లో ఉన్నంత వరకూ ఆయన ఒక వెలుగు వెలిగిపోయారు. ఆ తర్వాత జగన్ పార్టీలో చేరడం, ఆ తర్వాత టీడీపీ లో చేరి భీమిలీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు కావడంతో సబ్బం హరి హవా దిగజారిపోయింది. సబ్బం హరి మాటలకు విలువ లేకుండా అప్పటి నుంచే ప్రారంభమయింది. సబ్బంహరి చెప్పే జోస్యాలను కూడా ఎవరూ నమ్మడం లేదు.
మేయర్ గా పనిచేసి…..
గతంలో సబ్బం హరి విశాఖ మేయర్ గా కూడా పనిచేశారు. తన హయాంలోనే విశాఖ అభివృద్ధి జరిగిందని సబ్బం హరి చెప్పుకుంటారు. 2019 ఎన్నికలకు ముందు సబ్బంహరి టీడీపీ లో చేరారంటారు. అయితే ఆయన అధికారికంగా కండువా కప్పుకోకపోయినా భీమిలీ సీటు ఇచ్చారు చంద్రబాబు. ఆ రుణం తీర్చుకోవడానికేమో చంద్రబాబు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ అభివృద్ధఇ చేయలేరని సబ్బం హరి చెప్పుకొస్తారు. ఏపీకి చంద్రబాబు మాత్రమే శరణమని అంటారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ సబ్బం హరి చేసిన ప్రయత్నం బూమ్ రాంగ్ అయింది.
లోకల్… నాన్ లోకల్ అంటూ…
అయితే సబ్బం హరి మాటలకు విలువ ఉంటుందని చంద్రబాబు సయితం భావిస్తారు. కానీ అది భ్రమే అని తేలిపోయింది. ఇటీవల విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సమయంలో సబ్బం హరి లోకల్ , నాన్ లోకల్ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. విశాఖ వాసులు స్థానికులకే పెద్ద పీట వేయాలంటూ ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. ఎన్నికల వేళ సబ్బం హరి నాన్ లోకల్ నినాదాన్ని ఎత్తుకుంది వైసీపీని దెబ్బకొట్టడానికే. కానీ తీరా ఫలితాలు చూస్తే వైసీపీకి వన్ సైడ్ గా వచ్చాయి. దీన్ని బట్టి సబ్బం హరి మాటలను విశాఖ వాసులు కూడా లైట్ గా తీసుకున్నట్లే కదా? అందుకే సబ్బం హరి మున్సిపల్ ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు.