పైలట్ ఎగరేసుకుపోతారా…??
సచిన్ పైలట్…. ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మారుమోగిన పేరు. ఈ లోక్ సభ ఎన్నికల వేళ కూడా సచిన్ పైలెట్ హస్తం పార్టీని గెలిపించేందుకు [more]
సచిన్ పైలట్…. ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మారుమోగిన పేరు. ఈ లోక్ సభ ఎన్నికల వేళ కూడా సచిన్ పైలెట్ హస్తం పార్టీని గెలిపించేందుకు [more]
సచిన్ పైలట్…. ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మారుమోగిన పేరు. ఈ లోక్ సభ ఎన్నికల వేళ కూడా సచిన్ పైలెట్ హస్తం పార్టీని గెలిపించేందుకు అహర్నిశలూ కృషిచేస్తున్నారు. తండ్రి రాజేష్ పైలట్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈ యువనేత రాజస్ఘాన్ లో చరిష్మా కలిగిన లీడర్ గా ఎదిగారు. నిజానికి సచిన్ పైలట్ ప్రతిభ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే బయటపడింది. కేవలం 21 శాసనసభ స్థానాలనున్న కాంగ్రెస్ పార్టీని పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతటా తిరిగి సెంచరీ కొట్టేంతవరకూ సచిన్ పైలట్ నిద్రపోలేదు.
అంతా ఆయనే….
రాహుల్ కు అత్యంత విశ్వసనీయ సన్నిహితుల్లో సచిన్ పైలట్ ఒకరు. రాజస్థాన్ లో తిరిగి హస్తం పార్టీ గెలవడానికి సచిన్ పైలట్ కూడా కారణమని చెప్పక తప్పదు. నిజానికి ఆయనే రాజస్థాన్ ముఖ్యమంత్రి కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఆయనకు పదవి దక్కలేదు. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితో సచిన్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నేతలందరినీ సమన్వయం చేసుకోవడం, అభ్యర్థుల ఎంపికలో సాంకేతికతను అందిపుచ్చుకోవడంతోనే గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది.
కనీసం 20 స్థానాల్లో….
ఈసాని కూడా సచిన్ అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతటా కలియతిరుగుతున్నారు. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానమూ గెలవేలేదు. బీజీపీ 25 పార్లమెంటు స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి అది రిపీట్ చేయాలన్నది సచిన్ పైలట్ ఉద్దేశ్యం. అందుకే ఈసారి సచిన్ పైలట్ ప్రత్యేకంగా 20 నియోజకవర్గాలపై దృష్టిపెట్టారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు. అంతేకాకుండా మోదీ హవా కూడా మామూలుగా లేదు.
మోదీ హవా తగ్గడంతో….
కానీ ఈసారి కాంగ్రెస్ కు అడ్వాంటేజీ ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటమే కాకుండా మోదీ హవా పెద్దగా లేకపోవడం సచిన్ పైలట్ కు కలసి రావచ్చంటున్నారు. రాహుల్ ను ప్రధాని చేయాలన్న లక్ష్యంతో రాజస్థాన్ లో కనీసం 20 స్థానాలు గెలిచి కానుకగా ఇవ్వాలన్నది సచిన్ పైలట్ ఉద్దేశ్యం. అందుకోసం ఆయన ఈ లోక్ సభ ఎన్నికల్లో అలుపెరగకుండా ప్రచారం చేశారు. మరోవైపు బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. మోదీ హవా తగ్గిందేమో కాని, పటాన్ కోట్ దాడుల ప్రభావం ఈ రాష్ట్రంపై బలంగా ఉంటుందని కమలనాధులు నమ్ముతున్నారు. మరి సచిన్ పైలట్ ఎన్ని స్థానాలను కాంగ్రెస్ పరం చేస్తారో చూడాల్సి ఉంది.