వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జల ?
వైసీపీలో జగన్ సర్వం సహా అన్న మాట అయితే ఉంది. కానీ అన్నీ జగన్ చూడలేరు, చేయలేరు కూడా. మరి జగన్ కి తలలో నాలుకగా ఉండేవారే [more]
వైసీపీలో జగన్ సర్వం సహా అన్న మాట అయితే ఉంది. కానీ అన్నీ జగన్ చూడలేరు, చేయలేరు కూడా. మరి జగన్ కి తలలో నాలుకగా ఉండేవారే [more]
వైసీపీలో జగన్ సర్వం సహా అన్న మాట అయితే ఉంది. కానీ అన్నీ జగన్ చూడలేరు, చేయలేరు కూడా. మరి జగన్ కి తలలో నాలుకగా ఉండేవారే మిగిలిన విషయాలు చక్కబెడతారు అలా చూసుకుంటే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కి ఇపుడు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు అన్న మాట అయితే ఉంది. పార్టీ పరంగా ఏ స్టేట్మెంట్ బయటకు రావాలన్నా కూడా అది సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచే వస్తుంది. చంద్రబాబుని విమర్శించినా మరో నేత మీద కామెంట్స్ చేసినా కూడా సజ్జలే మీడియా ముందుకు రావాలి.
నడిపించేది ఆయనే….
సజ్జల రామకృష్ణారెడ్డి అంతకు ముందు సాక్షి పత్రికను నడిపించారు. మీడియా రంగంలో అనుభవం గడించారు. అన్నింటికీ మించి ఆయన జగన్ సతీమణి భారతికి దగ్గర బంధువు అన్న ప్రచారం కూడా ఉంది. దీంతో ఆయన ఇపుడు జగన్ కి బాగా కావాల్సిన వ్యక్తిగా మారారని చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన వైసీపీకి కొత్త శక్తిగా కూడా అవతరించారని పేర్కొంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మంచి వాగ్దాటి ఉన్న నేత కాదు, సబ్జెక్టు మీద పూర్తి పట్టు ఉంది అని కూడా ఎవరూ చెప్పలేరు. కానీ ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి బహు దగ్గర అంటే మాత్రం అంతా ఒప్పుకుంటారు.
చక్రం తిప్పేస్తున్నారు….
జగన్ పార్టీ కార్యక్రమాలను విభజించి కొందరికి అప్పగించారు. ఆ విధంగా చూస్తే గోదావరి జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి, ఉత్తరాంధ్రా బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించారు. కానీ వైవీ సుబ్బారెడ్డి ఆయా జిల్లాల మీద దృష్టి పెట్టింది పెద్దగా లేదు. విజయసాయిరెడ్డి కూడా మునుపటి చురుకుదనం చూపించడంలేదు. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం పదమూడు జిల్లాలను తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు అంటున్నారు. ముఖ్యమైన నేతలు, మంత్రులు సైతం ఆయనకు చేరువ అవుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు అంటున్నారు.
అదే అడ్డంకి …?
నిజానికి జగన్ పేరుకే ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి బాధ్యతలతోనే సరిపోతోంది. పార్టీ విషయాలు మాట్లాడడానికి తీరుబాటు ఉండడంలేదు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ చూస్తున్నారు అని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. పార్టీలో పంచాయతీలు అన్నీ కూడా ఆయన చూస్తున్నారు. మరీ పెద్దవి అయితేనే జగన్ దృష్టిలో పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు వస్తాయో ఎవరికి రావో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేస్తున్నారు. ఆ విధంగా కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిల మధ్య గొడవలు కూడా తీర్చారు. స్థానిక ఎన్నికలను సైతం మొత్తం మోనిటరింగ్ చేశారు. సరే అన్నీ ఆయనే చేస్తున్నారు కదా ఆయనకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేయవచ్చు కదా అన్న మాట పార్టీలో ఉంది. కానీ సామాజిక సమీకరణల్లో తేడా వస్తుంది కాబట్టే ఆయనకు పార్టీ పరంగా పోస్ట్ ని కేటాయించకుండా కధ మొత్తం ఆయన ద్వారానే నడిపిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి ఇపుడు జగన్ కుడి భుజం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పుకోవాలట.