సిద్ధూ పని ఫినిష్.. అవే సంకేతాలా?

మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా పట్టించుకోవడ లేదు. పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ఎంపిక అయిన తర్వాత ఆయనకు ప్రాధాన్యత ఎక్కువగా [more]

Update: 2020-06-17 17:30 GMT

మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా పట్టించుకోవడ లేదు. పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ఎంపిక అయిన తర్వాత ఆయనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. సిద్ధరామయ్య శాసనసభ పక్ష నేతగా కొనసాగుతున్నప్పటికీ ఆయన మాటకు పార్టీలో పెద్దగా విలువ లేకుండా పోయిందంటున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలు డీకే శివకుమార్ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ వెళ్లనున్నట్లు సంకేతాలు బలంగా అందుతున్నాయి.

తిరుగులేని నేతగా…..

సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు కొనసాగి రికార్డు సృష్టించారు. సిద్ధరామయ్య నాయకత్వంపై మొన్నటి ఎన్నికల వరకూ హైకమాండ్ కు నమ్మకం ఉండేది. అంతా ఆయన చెప్పినట్లే జరిగేవి. కానీ సిద్ధరామయ్య కు సన్నిహితులైన ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసిన దగ్గర నుంచి ఆయన పరపతి పూర్తిగా పడిపోయిందంటున్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధరామయ్య చేసిన సిఫార్సులను కాంగ్రెస్ పక్కన పెట్టింది.

పోటీగా నియమించి…..

డీకే శివకుమార్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. సిద్ధరామయ్య అనేకసార్లు అధిష్టానంతో మంతనాలు సాగించినా ఫలితం లేకుండా పోయింది. శాసనసభ పక్ష నేతగా సిద్ధరామయ్యను తొలగించాలని ఒక దశలో పార్టీ హైకమాండ్ ఆలోచించిందని చెబుతారు. అయితే పార్టీ శ్రే‍యస్సు దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకుందని చెబుతున్నారు. ఎప్పటికైనా సిద్ధరామయ్యను ఆ పదవినుంచి తొలగిస్తారన్న ప్రచారం ఊపందుకుంది.

వచ్చే ఎన్నికల నాటికి……

ఇప్పటికే సిద్ధరామయ్య గత ఎన్నికల సమయంలో ఇవే తన చివరి ఎన్నికలని ప్రకటించారు. ఇదే సమయంలో సిద్ధరామయ్య నేతృత్వంలో ఎన్నికలకు వెళితే మిత్రపక్షమైన జేడీఎస్ సహకరించే అవకాశముండదు. అందుకే సిద్ధరామయ్యను పార్టీలో వ్యతిరేకిస్తున్న మల్లికార్జున ఖర్గేను రాజ్యసభకు ఎంపిక చేశారు. అదే సమయంలో దేవెగౌడకు సయితం కాంగ్రెస్ మద్దతిచ్చింది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య పని ఫినిష్ అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News