తనను దాటి వెళ్లరన్నదే ధీమానా?

కర్ణాటకలో మొన్నటి వరకూ అధికారంలో భాగస్వామిగా ఉన్న పార్టీలు ఇప్పుడు దాదాపు చేతులెత్తే పరిస్థితికి వచ్చేశాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండటం, పార్టీని ఇప్పటి నుంచే [more]

Update: 2020-02-28 18:29 GMT

కర్ణాటకలో మొన్నటి వరకూ అధికారంలో భాగస్వామిగా ఉన్న పార్టీలు ఇప్పుడు దాదాపు చేతులెత్తే పరిస్థితికి వచ్చేశాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండటం, పార్టీని ఇప్పటి నుంచే నడపట ఆర్థిక భారంగా మారడంతో యాక్టివిటీ వైపు కాంగ్రెస్, జనతాదల్ ఎస్ లు వెళ్లలేకపోతున్నాయి. అడపా దడపా నిరసనలు తప్ప కాంగ్రెస్, జేడీఎస్ లు అధికార భారతీయ జనతా పార్టీపై పెద్దగా పోరాడిందేమీ లేదనే చెప్పాలి.

పార్టీని చక్కదిద్దేందుకు ….

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పౌరసత్వ చట్ట సవరణ వంటి వాటిపై ఆందోళనలు చేస్తూ ప్రజల్లో కన్పిస్తున్నారు. నిజానికి యడ్యూరప్ప బిందాస్ గా పాలనను చేసుకుంటున్నారనే చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయాలపై ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేసే పరిస్థితి రెండు పార్టీల్లోనూ లేదు. ఎందుకంటే ముందు వారికి పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవడమే ముఖ్యం. వచ్చే ఎన్నికలకు కూడా తానే నేతృత్వం వహిస్తానని సిద్ధరామయ్య ధీమాగా ఉన్నారు.

తనను మించిన వాడు…

తనను మించిన నేత కాంగ్రెస్ లో మరొకరడు లేడన్నది సిద్ధరామయ్య ప్రగాఢ విశ్వాసం. ఎవరూ తన లా రాష్ట్ర స్థాయి నేత లేరన్నది సిద్ధరామయ్య నమ్మకం. డీకే శివకుమార్ లేదా మరొకరికి పీసీీసీ చీఫ్ పగ్గాలు అప్పగించినా బేఫికర్ అంటున్నారట సిద్ధరామయ్య. మాజీ ముఖ్యమంత్రిగా తనకు అన్ని ప్రాంతాల్లో పట్టుంది. అంతేకాదు ప్రతి నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు సిద్ధరామయ్య.

అందుకే దూకుడుగా….

సిద్ధారామయ్య లేకుండా కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లలేదన్న విషయాన్ని కొందరు నేతలు సయితం బహిరంగంగానే అంగీకరిస్తున్నారట. ఇటీవల పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన వాళ్లలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య అనుచరులే. ఇప్పటికీ పార్టీ ఎమ్మెల్యేల్లో సిద్ధరామయ్య అనుచరులే ఎక్కువగా ఉన్నారంటున్నారు. అందుకే తనను దాట ి వెళ్లే సాహసం అధిష్టానం చేయదని సిద్ధరామయ్య సన్నిహితుల వద్ద చెబుతుండం విశేషం. మొత్తం మీద వచ్చే ఎన్నికలు కూడా తన చేతులు మీదుగానే జరుగుతాయని నేతలకు, క్యాడర్ కు బలంగా సంకేతాలను సిద్ధరామయ్య పంపుతున్నారు.

Tags:    

Similar News