సిద్ధూ చెప్పినవన్నీ శ్రీరంగ నీతులేనా?

సిద్దరామయ్య కాంగ్రెస్ లో సీనియర్ నేత. కాంగ్రెస్ లో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి సిద్దరామయ్య అరుదైన రికార్డును నెలకొల్పారు. అటువంటి సిద్ధరామయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ [more]

Update: 2020-10-07 16:30 GMT

సిద్దరామయ్య కాంగ్రెస్ లో సీనియర్ నేత. కాంగ్రెస్ లో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి సిద్దరామయ్య అరుదైన రికార్డును నెలకొల్పారు. అటువంటి సిద్ధరామయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. గత ఎన్నికల్లోనే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన సిద్ధరామయ్య తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. సిద్ధరామయ్య గత ఎన్నికల్లో చాముండేశ్వరి, బదామి నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా, బదామి నుంచి గెలిచారు. ఆ సమయంలోనే ఆయన ఈ శ్రీరంగనీతులు చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థిితిని చూస్తుంటే సిద్ధరామయ్య వచ్చే ఎన్నికలకు తానే నేతృత్వం వహించాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.

యడ్యూరప్ప ను…..

కర్ణాటకలో యడ్యూరప్ప టర్మ్ పూర్తవుతుంది. వచ్చే ఎన్నికలకు యడ్యూరప్పకు ఆ పార్టీ నాయకత్వం అప్పగించదు. ఇప్పటికే యడ్యూరప్ప కు 70 ఏళ్లు దాటాయి. మరోసారి యడ్యూరప్పకు రెన్యువల్ చేసే అవకాశం లేదు. ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు కర్ణాటక బీజేపీలో లేరు. ఒకరూ ఇద్దరూ ఉన్నా యడ్యూరప్ప స్థాయిలో ప్రభావితం చేయలేరు. యడ్యూరప్ప కుమారుడు కూడా అంతగా రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. ఇది వచ్చే ఎన్నికలలో తనకు కలసి వచ్చే అంశంగా సిద్ధరామయ్య భావిస్తున్నారు.

వెనక్కు తీసుకున్నట్లేనా?

అందుకే తాను ప్రత్యక్ష్య ఎన్నికల్లో ఇక పోటీ చేయబోనన్న మాటను సిద్ధరామయ్య వెనక్కు తీసుకున్నట్లుగానే కనపడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ అధినాయకత్వం కూడా సిద్ధరామయ్యపైనే ఎక్కువగా ఆధారపడింది. డీకే శివకుమార్ కు పీసీసీ అధ్యక్ష్య పదవి కట్టబెట్టినా అధినాయకత్వం సిద్ధరామయ్య మాటకే ఎక్కువగా విలువిస్తున్నట్లు కనపడుతుంది. సిద్ధరామయ్య కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడుగా వెళుతున్నారు. శాసనసభ పక్ష నేతగా ఆయన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

తనకంటూ ఒకవర్గాన్ని…..

ఇప్పటికే కాంగ్రెస్ లో సిద్ధరామయ్య తన కంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకున్నారు. శాసనసభ పక్ష నేతగా ఒక దశలో సిద్ధరామయ్యను తొలగించాలని అధినాయకత్వం భావించినా తన వర్గం ఎమ్మెల్యేలతో సమర్థవంతంగా సిద్ధరామయ్య తిప్పికొట్టగలిగారు. డీకే శివకుమార్ ప్రస్తుతం పీసీీసీ అధ్యక్షుడిగా ఉన్నా ఎన్నికల సమయానికి ఆయనను పదవిలో ఉండకుండా చేయాలన్న వ్యూహంలో సిద్ధరామయ్య ఉన్నారు. పీసీీసీ అధ్యక్ష్య పదవి రెండేళ్ల కాలమే కావడంతో సిద్ధరామయ్య భవిష్యత్ లో డీకే కు వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News