ఏచూరికి అన్యాయం జరిగిందా?
సీతారాం ఏచూరి. రాజ్యసభలో అధికార పార్టీని ఇరుకున పెట్టగల అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. సీతారాం ఏచూరి గత పన్నెండేళ్ల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. [more]
సీతారాం ఏచూరి. రాజ్యసభలో అధికార పార్టీని ఇరుకున పెట్టగల అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. సీతారాం ఏచూరి గత పన్నెండేళ్ల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. [more]
సీతారాం ఏచూరి. రాజ్యసభలో అధికార పార్టీని ఇరుకున పెట్టగల అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. సీతారాం ఏచూరి గత పన్నెండేళ్ల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పన్నెండేళ్లలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రభుత్వంలోని తప్పిదాలను నిర్భయంగా బయటపెట్టారు. సభలో ప్రభుత్వ నిర్ణయాలను దునుమాడారు. సీతారాం ఏచూరికి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు లేవు. పార్టీ నిబంధనల మేరకు రెండుసార్లకు మించి రాజ్యసభకు ఏ నాయకుడిని పంపే అవకాశాలు లేవని స్పష్టం చేసింది.
మరోసారి పంపేందుకు…..
సీతారాం ఏచూరి ప్రస్తుతం సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నిజానికి మరోసారి సీతారాం ఏచూరిని రాజ్యసభకు ఎంపిక చేయాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఒకదశలో కాంగ్రెస్ అధిష్టానం కూడా సీతారాం ఏచూరి అభ్యర్థిత్వం పట్ల సానుకూల స్పందించింది. సీతారాం ఏచూరిని పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదనను అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినా అధిష్టానం నచ్చ చెప్పింది. అయితే సీపీఎం నాయకత్వం మాత్రం సీతారాం ఏచూరిని మరోసారి రాజ్యసభకు పంపేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
జాతీయ రాజకీయాల్లో…..
సీతారాం ఏచూరి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషిస్తున్నారు. సీతారాం ఏచూరి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సీతారాం ఏచూరి చిన్న వయసులోనే వామపక్ష భావాలకు ఆకర్షితులయ్యారు. 1969 సమయంలోనే ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని జవహర్ లాల్ యూనిివర్సిటీలో ఎంఏ చదివిన సీతారం ఏచూరి సీపీఎం విద్యార్థి విభాగమైన ఎస్ఎఫ్ఐలో చురుగ్గా పనిచేశారు.
కేరళ నాయకత్వం వత్తిడితో…..
ప్రకాష్ కారత్ తర్వాత 2015లో సీతారాం ఏచూరి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన రెండో తెలుగువాడు సీతారాం ఏచూరి మాత్రమే. ఆయన పదవీ బాద్యతలను చేపట్టిన తర్వాత సీపీఎం అనేక రాష్ట్రాల్లో పూర్తిగా కనుమరుగై పోయిందన్న విమర్శలు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకంచేసేందుకు సీతారాం ఏచూరి అనేక ప్రయత్నాలు చేశారు. పార్టీలో కేరళ నేతల ఆధిపత్యం ఎక్కువ కావడంతోనే సీతారాం ఏచూరి విషయంలో అన్యాయం జరిగిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. సీపీఎం నిర్ణయంతో ఇక రాజ్యసభలో సీతారాం ఏచూరి గళం విన్పించే అవకాశం లేదు.