మరోసారి స్మృతికి అవకాశం ఉంటుందా?

వచ్చే ఎన్నికలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అమేధీ నుంచి రాహుల్ గాంధీ పైన గెలిచిన స్మృతి ఇరానీ తరచూ అమేధీలో పర్యటిస్తున్నారు. [more]

Update: 2021-03-09 18:29 GMT

వచ్చే ఎన్నికలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అమేధీ నుంచి రాహుల్ గాంధీ పైన గెలిచిన స్మృతి ఇరానీ తరచూ అమేధీలో పర్యటిస్తున్నారు. ఇటీవల ఆమె అమేధీ నియోజకవర్గంలో గృహ ప్రవేశం కూడా చేశారు. తాను అమేధీని వీడే ప్రసక్తి లేదని స్మృతి ఇరానీ చెబుతున్నారు. అమేధీ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోట వంటిది. అలాంటి అమేధీ నియోజకవర్గం నుంచి స్మృతి ఇరానీ గెలవడం అప్పట్లోనే సంచలనం అయింది.

ఒకసారి ఓడి…మరోసారి గెలిచి….

2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీ మీద అమేధీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు. అయినా మోదీ ఆమెకు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అమేధీ నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టడం, రాహుల్ ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ విజయం సాధించారు. అప్పటి నుంచి స్మృతి ఇరానీ అమేధీని వదిలిపెట్టడం లేదు.

అమేధీని దూరం చేయాలనుకున్నా….

ఎలాంటి రాజకీయ వారసత్వం లేని స్మృతి ఇరానీ కేవలం తన స్వయంకృషితోనే ఇంతవరకూ ఎదగగలిగారు. ఆమె అమేధీని కంచుకోటగా మలచుకుని, గాంధీ కుటుంబానికి దూరం చేయాలని భావిస్తున్నారు. అందుకే ఇటీవల రాహుల్ గాంధీ కేరళ పర్యటనలో చేసిన వ్యాఖ్యలను కూడా స్మృతి ఇరానీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ అమేధీని అవమానించారని స్మృతి ఇరానీ పదే పదే విమర్శలు చేస్తున్నారు.

ఈసారి మాత్రం……

అయితే జమిలి ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయంటున్నారు. అందుకే స్మృతి ఇరానీ పదే పదే అమేధీలో పర్యటిస్తున్నారు. కానీ ఈసారి అమేధీలో స్మృతి ఇరానీకి గెలుపు అంత సులువు కాదు. ఇప్పటికే ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మోదీ పై మోజు కూడా గతంలో కంటే బాగా తగ్గింది. దీంతో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి స్మృతి ఇరానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధాయేనని అంటున్నారు. మరోసారి అమేధీ గాంధీ కుటుంబానికి అండగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Tags:    

Similar News